అందని దానికొరకు పడే తాపత్రయంనమూనా
దేవుని వెంటాడుట
నీవు ఎక్కడికి వెళ్తున్నావు?
ఫలానా సమయములో మనము ఎక్కడికి వెళ్తున్నామనే నిమిత్తం లేకుండా, మన మదిలో ఒక గురి లేక గమ్యం కలిగి యుండటమనేది మనకు సహాయపడుతుంది.
మన చుట్టూ ఉన్న లోకంతో ఉన్న సమస్య ఏమిటంటే, మనము నిత్యము తప్పక చేయవలసిన పనులతోనే పూర్తిగా నింపబడియున్నాము. పేరు ప్రఖ్యాతలను, కీర్తిని మరియు ఆమోదాన్ని లాంటి మరెన్నో వాటిని మనము తప్పక వెంటాడాలి. మనకెదురుగా అనేక గమ్యములు ఉండుటతో, జీవితములో ఒక దిక్సూచి కొరకు వేచిచూస్తూ, ఎంతో మంది ఆగిపోయారనే విషయంలో పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనేమీ లేదు.
ఒక సమయమందు, కేవలం ఒకే గమ్యము నొద్దకు మనము వెళ్ళగలిగిన యెడల, ఆ గమ్యము ఏమై యుంటుంది?
హెబ్రీయులకు 12:1-3 మనకు స్పష్టము చేస్తుంది. మన దృష్టిని యేసు మీదనే కేంద్రీకృతము చేసి ఉంచాలి. మనము ఆయన యొద్దకు పరుగెత్తినప్పుడు, మనము కేవలము ఆయనను పొందుకోవటమే కాక, మనకు కావాల్సిన సమస్తమును పొందుకొనగలము. మన పాపముల పరిహారమును ఆయన చెల్లించెను. మనకొరకు ఆయన నిత్యజీవమును భద్రపరచెను. అనుదినము మనలను ఆయన పోషించును. మరియు మనము దేని నిమిత్తం సృష్టింపబడ్డామో దాని దిశగా ఆయన మనలను మార్చును.
కాని క్రీస్తు వైపుగా నీవు ఎలా పరుగెత్తాలి? ఆయన ఏమి చేసెనో దానిని నీవునూ చేయుటయే.
ప్రార్థన.అనేక దినములు జన సమూహములతో ఆయన మాట్లాడిన పిదప యేసు తిరిగి తాను నింపపడేందుకు, ఆయన తన తండ్రిని వెదకసాగెను. గెత్సేమనే తోటలో ఆయన బహుగా కృంగినవేళ, ఆయన తన తండ్రికి మొర్రపెట్టెను. ప్రార్థన నిన్ను క్రీస్తుతో సంబంధం కలిగియుండేలా చేయును.
ప్రజలు.ఇతర ప్రజలతో ఒక సంబంధం కలిగి జీవించేలా మనము సృష్టింపబడ్డాము. యేసు ఈలోకంలో ఉన్న సమయములో తన చుట్టూ ప్రజలు ఉండేలా చూసుకొని, వారి విశ్వాసమును సవాలు చేస్తూ మరియు బలపరుస్తూ ఉండేవాడు. నీవు సమయం ఎక్కువ గడిపే వ్యక్తులు దేనిని వెంటాడుతారో చాలా మట్టుకు నీవు కూడా దానినే వెంటాడుతావు. కావున, దేవుని వెంబడించే వ్యక్తులతో నీవు సమయమును గడుపుము.
పరిచర్యఈ భూమి మీదకు యేసు వచ్చినది పరిచర్య చేయుటకు-ఆయన చెప్పినట్లే ఆయన చేసెను. ఆ విధముగా చిన్నపెద్ద కార్యాలలో ఆయన పరిచర్య చేసెను, మరియు తన ప్రాణమునే మన కొరకు పెట్టుట ద్వారా - ఒక గొప్ప త్యాగముతో తన పరిచర్యను ముగించెను. మన చుట్టూ ఉన్న వారికి మనం సేవ చేసినప్పుడు, యేసు చేసినది చేయుట ద్వారా మనము దేవుని వెంబడించు వారిగా ఉంటాము.
ఉపవాసము.యేసు అరణ్యములో ఆహారము నుండి ఉపవాసము ఉండినప్పుడైననూ, లేక ప్రశాంతతను మరియు ఏకాంతమును కనుగొనుటకు తన చుట్టూ ఉన్న ప్రజల నుండి ఆయన వెడలినప్పుడైననూ, దేవుని వెదకాలి అంటే కొన్ని సార్లు తాను దేవుని కుమారుడైనప్పటికి తన జీవితములోని కొన్ని విషయాలను తాత్కాలికంగా ప్రక్కన పెట్టాలని యేసునకు తెలియును. దేవుని వెదకాలి అంటే నీవు అప్పుడప్పుడు తీసివేసుకోవాల్సిన విషయాలు ఏమై యున్నాయి?
వాక్యము. యేసునకు దీనిపై ఒక గొప్ప ప్రారంభం కలదు-యోహాను 1 చెప్పినట్లుగా, దేవుని వాక్యమునకు క్రీస్తు మానవుని రూపమైయున్నాడు. బైబిల్లో మనకోసం పొందుపరచిన దేవుని మార్గ దర్శకమును గూర్చి క్రమముగా చదువుట, అధ్యయనం చేయుట మరియు ఆలోచించుట అనునది క్రీస్తును మనము తెలుసుకోగలిగే ఉత్తమమైన మార్గాలలో ఒకటిగా ఉన్నది.
మీరు చేయవలసిన పని:పైనున్న వాటిలో వేటిని మీ జీవితములో కార్యరూపాన్ని దాల్చగలరు? దానికి మీరు ఎలా ప్రారంభిస్తారు? దీని గురించి మీరు ఎవరితో చెప్పగలరు?
ఈ ప్రణాళిక గురించి
మనమందరము ఎల్లపుడు ఏదో ఒక దానిని వెంటాడుతూనే ఉంటాము. సాధారణముగా అది మనకు అందీ అందనట్లుగానే ఉంటుంది - ఒక మంచి ఉద్యోగం, చక్కటి ఇల్లు, ఒక పరిపూర్ణ కుటుంబము లేక ఇతరుల నుండి మెప్పు వంటివి అయివుండవచ్చు. కానీ ఇదంతా ఏంతో ప్రయాసముతో కూడినదిగా ఉంది కదూ? దీని కన్నా మెరుగైన మార్గము లేదా? పాస్టర్ క్రైగ్ గ్రోషేల్ గారి సందేశముల సముదాయమైన, "చేసింగ్ కారేట్స్" నుంచి సేకరించబడి, Life.Church వారిచే రూపొందించబడిన ఈ బైబిల్ ప్రణాళికలో దీనికి సరైన సమాధానమును కనుగొనండి.
More