అందని దానికొరకు పడే తాపత్రయంనమూనా
విజయములను వెంటాడుట
బైబిల్ లోని రాజుల ప్రస్తావనకొస్తే, సొలొమోను సాధించినంతగా ఏ ఒక్కరు సాధించలేదు. అతని పాలనలో ఇశ్రాయేలు దేశము బహుగా ఫలించెను. దేవుని మందిర నిర్మాణమును ఆయనే చేయించెను. తనకుగా ఒక రాజ మందిరమును కూడా నిర్మించుకునెను. అతని యొక్క ధనఘనతలను చూచుటకు రాజులు బహు దూరములు ప్రయాణించి తమతో పాటు బంగారు మరియు ఆభరణముల బహుమానములు తీసుకొని వచ్చేవారు. వారు అడిగే ఎటువంటి ప్రశ్ననైనా అతను సమాధానమిచ్చేవాడు. తనకు నచ్చిన స్త్రీలను వివాహము చేసికొనెను. ఒకరి జీవితకాలములో ఆశించే ప్రతి మంచి విషయముచేత అతను ఆశీర్వదింపబడెను.
జీవితములో తాము సాధించిన వాటితో ఎవరైనా సంతోషంగా ఉండగలరంటే, అది ఖచ్చితంగా సొలొమోను అయియుండును. కాని ప్రసంగి గ్రంథములో, సొలొమోను మనకి వేరే విధంగా తెలియజేయును. "సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటి . . . యందు నేను అసహ్యపడితిని" అని అతను సూటిగా చెప్పెను. ఎందుకనగా వాటిని "నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని " తెలుసుకున్నానని అతను చెప్పెను.
మరణమైన తరువాత వేటిని కూడా వెంటబెట్టుకొని వెళ్ళలేమనే విషయాన్ని సొలొమోను గ్రహించాడు. మన ఇళ్ళు, పురస్కారాలు, కార్లు మరియు పదోన్నతులన్ని కూడా మన వెనకే ఆగిపోవును.
అసలు జీవితములో ఏది ప్రాముఖ్యమైనదని ఆశ్చర్యపోతున్నారా?
ఆ ప్రశ్నకు సొలొమోను జవాబును కనుగొన్నాడు. ప్రసంగి గ్రంథ ముగింపు భాగములో, "దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి" అని తేల్చి చెప్పెను.
మొదట్లో ఇది అంత గొప్ప స్పూర్తిదాయకమైన విషయమేమి కాదన్నట్లుగానే అనిపిస్తుంది కాని ఇంకొకసారి ఆలోచించండి. దేవునియందు భయభక్తులు కలిగియుండుట-అనగా ఆయనను ప్రేమించుట, ఆయనను గౌరవించుట మరియు ఆయన చెప్పినది చేయుట: ఈ విషయాలనే మనము సాధించుటకు వెంటాడాలని సొలొమోను చెప్పెను.
"ఆగకుండా పరుగెత్తు! ఈ విలువైన వస్తువులను చూసావా? ఆ ప్రశంసల్ని చూసావా? వేల మంది వీటిని కోరుకుంటారు, కాని ఆ విషయం నిన్ను ఆగనీయకుండా చూసుకో. వాటి కొరకు పోరాడు! వెళ్ళు! నీ జీవితంలో వీటిని కాక ఇంక దేనికొరకు ప్రయాసపడుతున్నావు? జీవితమంటే ఒక ఆట, కేవలం ఉత్తమమైన వారే దానిలో గెలుపొందుతారు" అని చెప్పే ప్రపంచానికి మనము అలవాటు పడిపోయాము.
కాని దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది, "దేవుని ప్రేమించుము. మంచిని చేయుము"
ప్రతి ఒక్కరికి ఇది ఎంత అందుబాటులో ఉన్నదో ఆలోచించండి. నీకు వివాహామైనా లేక ఇంకా కాకపోయినా, సంపన్నులవైనా లేక పేదలుగా ఉన్నా, యవ్వనులవైనా లేక వృద్ధులైనా, ఆరోగ్యకరంగా ఉన్నా లేక వ్యాధితో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని ప్రేమించు. మంచిని చేయి.
ఆలోచించండి:నీ జీవితములోని ప్రతి పరిస్థితి నందు నీ యొక్క లక్ష్యము దేవుని ప్రేమించుట మరియు మంచిని చేయుటయే అయితే ఏ విధమైన మార్పులు చోటుచేసుకొనును? ఈ లక్ష్యాన్ని నీవు ఎలా సాధించగలవు?
ఈ ప్రణాళిక గురించి
మనమందరము ఎల్లపుడు ఏదో ఒక దానిని వెంటాడుతూనే ఉంటాము. సాధారణముగా అది మనకు అందీ అందనట్లుగానే ఉంటుంది - ఒక మంచి ఉద్యోగం, చక్కటి ఇల్లు, ఒక పరిపూర్ణ కుటుంబము లేక ఇతరుల నుండి మెప్పు వంటివి అయివుండవచ్చు. కానీ ఇదంతా ఏంతో ప్రయాసముతో కూడినదిగా ఉంది కదూ? దీని కన్నా మెరుగైన మార్గము లేదా? పాస్టర్ క్రైగ్ గ్రోషేల్ గారి సందేశముల సముదాయమైన, "చేసింగ్ కారేట్స్" నుంచి సేకరించబడి, Life.Church వారిచే రూపొందించబడిన ఈ బైబిల్ ప్రణాళికలో దీనికి సరైన సమాధానమును కనుగొనండి.
More