అందని దానికొరకు పడే తాపత్రయంనమూనా
పరిపూర్ణతను వెంటాడుట
"మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, మీరును పరిపూర్ణులుగా ఉండెదరు." మత్తయి 5:48
అదేం గొప్ప విశేషమేమి కాదు, కదా? పరిశుద్ధుడు, నీతిమంతుడై యుండి ఈ విశ్వమంతటిని సృష్టించిన దేవుడు పరిపూర్ణుడై యున్నలాగున - మీరును అంతే పరిపూర్ణులై యుండాలి.
ఏం పెద్ద విశేషమేమి కాదు, కదా?
అవును, ఏమంత కాదు.
మీకు మీరే పరిపూర్ణులుగా చేసికొనవలెనంటే, ఇంతకీ ఎక్కడ నుంచి మొదలు పెడతారు? దేవుడు పరిపూర్ణుడు ఎందుకనగా ఆయన యందు పాపము కాని, అపరాధము కాని ఉండదు. చక్కటి దుస్తులు, చక్కటి గృహము, మంచి భార్య లేక మంచి భర్త లాంటి-ఈ లోకానుసారమైన పరిపూర్ణతను గురించి మేము ఇక్కడ మాట్లాడుట లేదు. మనము మాట్లాడుచున్నది వీటన్నిటి కంటే చాలా ఉన్నతమైనది. ఇక్కడ మీరు పాపరహితులు గా ఉండవలసి యుంటుంది. అబద్ధములాడకూడదు, శాపములు పెట్టకూడదు, పిల్లలపై విరుచుకు పడకూడదు, లేక మీ స్నేహితుని యొక్క Netflix password ను "అప్పుగా" తీసుకొనకూడదు.
"తప్పకుండా, నేను అది చేయగలను" అని మీరంటారని కాసేపు అనుకుందాం. అలా మీరు చేయవచ్చు కూడా. మీరు మీ పనులను చక్కబరచుకుంటారు. మీరు వేగ పరిమితిని పాటిస్తారు. మీరు బీదలకు దానమిస్తారు. మీ Netflix కోసం మీరే చెల్లిస్తారు. ఇలా కొన్ని రోజులు, తరువాత కొన్ని వారాలు, తరువాత కొన్ని నెలలు, ఆ తరువాత కొన్ని ఏళ్ళు ఇలా చేసారనుకుందాం.
అయినప్పటికి మీరు పరిపూర్ణులుగా మారలేరు.
చూడండి, ఇక్కడ నీవు ఇంతకుముందు చేసిన పాపములను గూర్చిన ఒక చిన్న విషయం ఉంది. యాకోబు 2:10 చెప్పిన విధంగా- ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును.
కాబట్టి, దీని నుంచి ఎలా తప్పించుకుంటారు?
మత్తయి 19లో, తాను మంచివాడనని చూపించుకోవటానికి వచ్చే ఒక ధనవంతుడైన యవ్వనస్థుడు కనబడును. తాను నిత్యజీవమును పొందుటకు ఏమి చేయవలెనని అతను యేసును అడిగెను. ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞలను పాటించుమని అతనికి యేసు చెప్పెను. అందులో ఉన్న ప్రతి ఆజ్ఞను తాను పాటిస్తున్నానని అతను చెప్పెను. అందుకు యేసు -"పరిపూర్ణుడవగుటకు నీవు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును;నీవు వచ్చి నన్ను వెంబడించు"మని అతనితో చెప్పెను. అయితే ఆ యౌవనస్థుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయెను.
పరిపూర్ణులు కావాలంటే ఎదో రెండు దశల ప్రణాళిక అని యేసు ఆ యవ్వనస్థునికి చెప్పట్లేదు. మొదట, ఆజ్ఞలను పాటించుమని మరియు రెండవది, నీకున్నదంతయు అమ్మివేయుమని. ఒక వ్యక్తి తనను అనుసరించకుండా ఉండగలిగే వాటిని వదిలి వచ్చుట ద్వారా పరిపూర్ణతకు మార్గం మొదలవుతుందని యేసు ఇక్కడ చెప్పుచున్నాడు.
కాని పరిపూర్ణత? ఎవరైనా పరిపూర్ణులుగా ఎలా అవుతారు? ఇది లోకానుసారమైన పరిపూర్ణత కాదు. ఇది ఇంకా ఎంతో గొప్పది. క్రీస్తును వెంబడించుటకు నీవు నిర్ణయించుకున్నప్పుడు, ఆయన సిలువపై మరణించినప్పుడు నీ పాపములను మరియు అతిక్రమములను తన మరణములో కప్పివేసెను. మరియు దేవుని దృష్టిలో, క్రీస్తు తనకు తాను ఏ విధంగా పరిపూర్ణునిగా ఉన్నాడో నీవు కూడా అణువణువునా అంత పరిపూర్ణతలోనికి మారిపోతావు.
ప్రార్థన:దేవా, నీ కుమారుని యొక్క పరిపూర్ణ బలిఅర్పణకై వందనములు. క్రీస్తును వెంబడించ కుండా నాకు అడ్డుగా నిలుచు దేనినైననూ నేను వదిలివేయుటకు నాకు సహాయము చేయుము. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్.
ఈ ప్రణాళిక గురించి
మనమందరము ఎల్లపుడు ఏదో ఒక దానిని వెంటాడుతూనే ఉంటాము. సాధారణముగా అది మనకు అందీ అందనట్లుగానే ఉంటుంది - ఒక మంచి ఉద్యోగం, చక్కటి ఇల్లు, ఒక పరిపూర్ణ కుటుంబము లేక ఇతరుల నుండి మెప్పు వంటివి అయివుండవచ్చు. కానీ ఇదంతా ఏంతో ప్రయాసముతో కూడినదిగా ఉంది కదూ? దీని కన్నా మెరుగైన మార్గము లేదా? పాస్టర్ క్రైగ్ గ్రోషేల్ గారి సందేశముల సముదాయమైన, "చేసింగ్ కారేట్స్" నుంచి సేకరించబడి, Life.Church వారిచే రూపొందించబడిన ఈ బైబిల్ ప్రణాళికలో దీనికి సరైన సమాధానమును కనుగొనండి.
More