అందని దానికొరకు పడే తాపత్రయంనమూనా
చేసింగ్ కారేట్స్
చేసింగ్ కారేట్స్ యొక్క ఆలోచన 1800ల మధ్యలో కార్రేట్ మరియు కర్ర గురించి వ్రాయబడిన మొట్టమొదటి ఉపమానము నుండి వచ్చెను. అందుబాటులో లేని ఒక కారెట్ కొరకు తాపత్రయ పడే ఒక గాడిద యొక్క చిత్రమును ఊహించుకొనండి. ఒక పొడుగాటి కర్రకు వ్రేలాడదీసిన కారెట్ ను గాడిద ముందుంచి పందెములో తన గాడిదను ఉత్తేజపరచేందుకు దానిని నడిపించు వ్యక్తి వాడును. ఆ గాడిదకైతే, తన ప్రతిఫలం ఎప్పుడూ ఒక్క అడుగు దూరంలోనే ఉన్నట్లు ఉండును.
నీకేప్పుడైన అలా గాడిదలాగా అనిపించిందా?
జీవితంలో పడే వ్యర్థ ప్రయాసలన్ని కూడా "ఒకడు గాలికి ప్రయాసపడునట్లు" గానే ఉండునని, రాజైన సోలోమోను 1800 లకు చాలా ఏళ్ల క్రితమే తెలిపెను.
నీవెప్పుడైనా గాలిని పట్టుకోవటానికి ప్రయత్నించావా? అది కూడా కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నట్లు అనిపించును.
"కేవలం ఒక్క అడుగు" లో నున్న గమ్మత్తు ఏంటంటే కేవలం ఆ ఒక్క అడుగు ఎల్లప్పుడు ఉండును. ఈ ఉద్యోగంలో కేవలం ఇంకొన్ని ఏళ్ళు, లేక ఒక్కసారి ఉత్తీర్ణులమైయ్యాక, లేక నీకు వివాహం అయిన వెంటనే, లేక నీ పిల్లలు ఎదిగిన పిమ్మట, లేక నీ విశ్వాసం ఇంకొంచెం బలపడ్డాక, లేక నీకు ఇది ఉంటే సంతోషంగా ఉంటావనే దేదైనా సరే. కేవలం. ఇంకొక్క. అడుగు. దూరమే.
జీవించుటకు ఇంకా మంచి మార్గమొకటి కలదు. కార్యప్రదర్శన అనే ఈ థ్రెడ్ మిల్ నుండి నీవు బయటకు రావచ్చును. గొప్పది మరియు ఉన్నతమైనదే కాకుండా జీవితంలో ఇంకా చాలా ఉంది.
మత్తయి 6వ అధ్యాయములో యేసు ఈ వెర్రి ప్రాకులాటను గురించే మాట్లాడెను. ఈనాడు యేసు యొక్క మాటలను నీవు చదువుతుండంగా, దీనిని చేయండి. లోతైన శ్వాస తీసుకొని నీ మదిలోనున్న చింతలన్నిటిని తొలగించివేయుము. ఆయన బోధిస్తున్నప్పుడు, నీవు కూడా అక్కడ ఉన్నట్లు ఊహించుకొనుము. దేని మీద నీవు కూర్చున్నావు? ఆ గాలి యొక్క పరిమళం ఏ విధంగా ఉన్నది? ఆయన స్వరము ఎలా ఉన్నది? ఇంకా ఏవేవి వినిపిస్తున్నాయి? ఏమి చూడగలుగుతున్నావు? ఆయన స్వరము యొక్క శబ్దము నీలో ఏ ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నది?
పైన చెప్పబడిన విధంగా ఈనాటి వాక్య భాగమును చదివిన తరువాత, నీవు గమనించవలసిన రెండు ప్రశ్నలు చూడుము. కాసేపు నిదానించి యేసు చెంత ఉంటే ఎంత బాగుండునో కదా? నా జీవితములో ఇంకా ఎక్కువగా యేసును ఎలా ఆహ్వానించగలను?
ప్రార్థన: ఈనాటి వాక్యములను చదివిన తరువాత, ఈ దినమంతటిలో ఆయన నుండి వినుటకు తగినంతగా నిమ్మల పరచుమని దేవుని ప్రార్థించి అడుగుము.
Find video, discussion guides, and more about Chasing Carrots.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మనమందరము ఎల్లపుడు ఏదో ఒక దానిని వెంటాడుతూనే ఉంటాము. సాధారణముగా అది మనకు అందీ అందనట్లుగానే ఉంటుంది - ఒక మంచి ఉద్యోగం, చక్కటి ఇల్లు, ఒక పరిపూర్ణ కుటుంబము లేక ఇతరుల నుండి మెప్పు వంటివి అయివుండవచ్చు. కానీ ఇదంతా ఏంతో ప్రయాసముతో కూడినదిగా ఉంది కదూ? దీని కన్నా మెరుగైన మార్గము లేదా? పాస్టర్ క్రైగ్ గ్రోషేల్ గారి సందేశముల సముదాయమైన, "చేసింగ్ కారేట్స్" నుంచి సేకరించబడి, Life.Church వారిచే రూపొందించబడిన ఈ బైబిల్ ప్రణాళికలో దీనికి సరైన సమాధానమును కనుగొనండి.
More