అందని దానికొరకు పడే తాపత్రయంనమూనా

Chasing Carrots

7 యొక్క 6

ఆదరణను వెంటాడుట

మనం ఒత్తిడికి గురైనా, బాధపడినా, అలసిపోయినా, ఒంటరిగా ఉన్నా, లేదా విసుగు చెందినా, మనమందరం కొన్ని సమయాల్లో ఓదార్పును వెంటాడుతూ ఉంటాము. ఎక్కువ కాలం ఆదరణ కలిగించేదిగా ఉంటూ ఓదార్పును అందించే విషయాల గురించి ఎవరు ఎక్కువగా ఖర్చు చేయరు, ఎవరు అతిగా తినకుండా ఉండరు, ఎవరు అతిగా తాగకుండా ఉండరు మరియు అతిగా అంచనా వేయకుండా యుండియుండరు చెప్పండి?

ఆదరణ అనే మాటకు ఇంగ్లిష్ అనువాదమైన "comfort" అను పదమునకు ఒక విచిత్రమైన చరిత్ర కలదు. ఆ పదమూలము రెండు లాటిన్ భాష పద భాగములైన com, అనగా "తోడుగా" మరియు fortis అనగా " బలము లేక శక్తి" నుండి వచ్చెను. దాని తరువాత, అది "అధికంగా బలపరచుట" అను అర్థానిచ్చే confortare లాటిన్ పదముగా రూపొందుకుంది. క్రమముగా, "ఓదార్పు" మరియు "సహాయము" అను పదములు ఆ conforter అనే పాతకాలపు ఫ్రెంచ్ పదము యొక్క నిర్వచనానికి జతపరచబడెను. 14వ శతాబ్దములో, "ప్రోత్సాహపరచుట, ఆదరణ కలిగించుట" అనే అర్థాన్నిచ్చే conforten అనే మరొక ఫ్రెంచ్ పదము వచ్చెను. చివరగా ఇక 17వ శతాబ్దము నాటికి, ఈనాడు మనము అర్థము చేసుకొనే comfort యొక్క ఇంగ్లిష్ పద సంస్కరణగా రూపుదిద్దుకొంది.

అసలు ఈ సంగతులన్ని మనకెందుకు? ఒక సహస్రాబ్ది కాలంలో, “comfort” అనే పదం యొక్క అర్ధము, "తోడుగా-బలంగా" నుండి "బాధ-నివారణ" అని అర్ధంగా మారెను.

మీరు దేవునిని మీ యొక్క బలముగా, బాధల సమయములో మీతోపాటు ఉండువానిగా, లేక బాధను నివారించే వానిగా చూస్తున్నారా?

మన అతిక్రమముల నిమిత్తం తాను గాయాల పాలై మరియు మన స్వస్థత కొరకు బాధ ననుభవించుటకు రాబోయే ఒక అభిషిక్తుని గూర్చి ప్రవక్తయైన యెషయా ముందుగానే ప్రవచించెను. మన విశ్వాసము యొక్క అసలు తత్వము యేసుని అడుగుజాడలలో నడవటమే అయితే, ఆ బాధకు ఆయన యొక్క ప్రతిస్పందన ఏమైయున్నదో ఒక్కసారి గమనిద్దాము. 1 పేతురు 2:21-25లో, బాధను అనుభవించడానికి ఏ విధముగాను అతిక్రమము చేయక ఆ బాధను స్వీకరించిన ఒక గొప్ప రక్షకుని మనము చూస్తాము. యేసు ఆ బాధను అడ్డుకోలేదు లేక ఒక బలిపశువు కోసం ఎదురుచూడలేదు; ఆయన మన లోకమునకు వచ్చెను మరియు మన బాధను తన బాధగా చేసికొనెను.

యేసే మనకు తోడుండే మన బలము. కావున, తండ్రి దగ్గరకు ఆయన తిరిగి వెళ్ళే ముందు, పరిశుద్ధాత్మ అను - ఒక ఆదరణకర్త - ను మనతో పాటు ఉండుటకు మాత్రమే కాక, మనలో ఉండుటకు ఆయన మనకు వాగ్దానమిచ్చెను! మనము వెంటాడుటకు ఇది నిజముగా ఎంతో విలువ కలిగినది.

కాబట్టి, మన నమ్మకమైన స్నేహితులతో కలిసి Netflix సిరీస్‌ లన్నిటిని చూసి ముగిస్తూ ఉండే -లోకానుసారమైన ఆదరణను మనము వెంటాడకయుందము. దానికి ప్రతిగా, పరిశుద్ధాత్మ నుండి పొందు ఆదరణను, అనగా అదేదో బాధలు-లేని జీవితమని అర్థము కాదు కాని ఆ బాధల మధ్యలో ఉండే ఆదరణ అని ఎరిగి దానిని పొందుటకు ప్రయాసపడుదము.

ప్రార్థన:ప్రభువా, నేను ఇబ్బందులను ఇష్టపడను, కాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దయచేసి నీ యొక్క ఆదరణను గూర్చిన నా అవగాహనను మార్చి, దానిని నిజముగా అనుభవించుటకు నాకు సహాయము చేయుము. పరిశుద్ధాత్మ దేవా, "తోడుండే బలము"గా నీవు నాతో మరియు నాలో ఎలా ఉన్నావో నాకు తెలియజేయుము. యేసయ్యా, సిలువపై నా యొక్క అవమానమును భరించినందుకు వందనాలు. ఆమెన్

రోజు 5రోజు 7

ఈ ప్రణాళిక గురించి

Chasing Carrots

మనమందరము ఎల్లపుడు ఏదో ఒక దానిని వెంటాడుతూనే ఉంటాము. సాధారణముగా అది మనకు అందీ అందనట్లుగానే ఉంటుంది - ఒక మంచి ఉద్యోగం, చక్కటి ఇల్లు, ఒక పరిపూర్ణ కుటుంబము లేక ఇతరుల నుండి మెప్పు వంటివి అయివుండవచ్చు. కానీ ఇదంతా ఏంతో ప్రయాసముతో కూడినదిగా ఉంది కదూ? దీని కన్నా మెరుగైన మార్గము లేదా? పాస్టర్ క్రైగ్ గ్రోషేల్ గారి సందేశముల సముదాయమైన, "చేసింగ్ కారేట్స్" నుంచి సేకరించబడి, Life.Church వారిచే రూపొందించబడిన ఈ బైబిల్ ప్రణాళికలో దీనికి సరైన సమాధానమును కనుగొనండి.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు https://www.life.church/ దర్శించండి