ఈస్టరు కథనమూనా

The Story of Easter

7 యొక్క 7

ఆదివారము

ఈ అద్భుతమైన రోజు, సిలువను గూర్చి, ఖాళీ సమాధిని గూర్చి మరియు అవి మనకు అనుగ్రహించిన అన్నిటిని గూర్చి ధ్యానిద్దాము. కానీ ఈ రోజు "మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి..." అని మనకు ఇవ్వబడిన పిలుపు నిమిత్తమై కూడా ధ్యానిద్దాము. కృపను గురించిన మంచి వర్తమానమును స్వీకరించటమే కాక, అది ఇతరులకు అందివ్వాలి అను స్వచ్ఛమైన సువార్తను క్రీస్తు తన శిష్యులకు విడిచివెళ్లాడు. అనేకమందిని శిష్యులుగా చేసి, ఫలించెడివారిగా యేసు తన శిష్యులను ఆయుత్తపరిచాడు. ఇది కార్యరూపము దాల్చిందని మనము చెప్పవచ్చు ఎందుకంటే వారి వలన శిష్యులుగా మారిన ప్రజలు కూడా ఇతరులను శిష్యులుగా చేయటము ప్రారంభించారు. రెండు వేల సంవత్సరాల పాటు ఈవిధముగా సువార్త వ్యాప్తి చెందుతూ వుంది. కానీ బహుశా ప్రతి తరములో, ఖచ్చితంగా మన తరములో, కొన్నిసార్లు మనము బలహీనమైన వారికి సువార్తను అందిస్తున్నాము. దీనివలన, ఫలించవలసిన మనము విత్తనములే లేనటువంటి ద్రాక్షావల్లిని పండిస్తున్నాము. మనము పొందుకున్న కృప నిమిత్తము ఆయనను కృతజ్ఞతా భావముతో ఆరాధిస్తున్న సమయములో, ఆయన మనకు అప్పగించిన గొప్ప బాధ్యతను మరింత గొప్ప సవాలుగా స్వీకరించి అయన కృపా సువార్తను వ్యాపింప చేయాలని ప్రార్ధన చేద్దాము.
రోజు 6

ఈ ప్రణాళిక గురించి

The Story of Easter

ఈ వారం ఇక మీ జీవితంలోని చివరి వారం అని తెలిసినప్పుడు ఆ చివరి వారం మీరు ఎలా గడుపుతారు? యేసు మానవ రూపంలో భూమిపై జీవించిన చివరి వారము చిరస్మరణీయమైన క్షణాలతో, ప్రవచనాల నెరవేర్పుతో, సన్నిహిత ప్రార్థనతో, లోతైన చర్చతో, సూచక క్రియలతో మరియు ప్రపంచమును మార్చివేసే సంఘటనలతో నిండిపోయింది. ఈస్టర్ కు మునుపు సోమవారం ప్రారంభమవటానికి రూపొందించబడిన ఈ Life.Church యొక్క బైబిలు ప్రణాళిక, పవిత్రమైన వారములోని ప్రతిదినాన్ని ఒక కథానిక ద్వారా మీకు విశిదపరుస్తూ మిమ్మును నడిపిస్తుంది.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మీరు Life.Church గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి సందర్శించండి: www.Life.Church