ఈస్టరు కథనమూనా

The Story of Easter

7 యొక్క 4

గురువారము

మరణ సమయములో క్రీస్తు వెంబడి ఉన్న ఆయన మొదటి శిష్యుల స్థానంలో మిమ్మల్ని ఊహించుకోండి. మీ హృదయం విరిగిపోతుంది. మీ మనస్సు ఆందోళన చెందుతుంది. ఇది యూదుల రాజుకు జరుగవలిసింది కాదు. ఆయన ప్రతిదీ సరి చేయవలసి ఉంది. విచ్ఛిన్నమైన దానిని బాగు చేయవలసి ఉంది. పోగొట్టుకున్నదాన్ని పునరుద్ధరించాలి. కానీ ఇప్పుడు, అన్ని కోల్పోయినట్టు, అన్ని విరిగినట్టు అనిపిస్తుంది. ఏదీ సరిగా లేదు. ఈరోజు కొంత సమయం శిలువకీ ఖాళీ సమాధికి మధ్యనున్న ప్రదేశములో జీవించడానికి ప్రయత్నిద్దాము. నిరీక్షణ కోల్పోయినది. కృప ఇంకా సమీపించలేదు. ప్రతిరోజు ఇటువంటి స్థితిలో మీకు తెలిసినవారు జీవిస్తున్నట్లైతే వారినిగూర్చి మీ ప్రార్థనకు ఇంధనంగా ఆ భావనను ఉపయోగించండి. ఈ వారాంతంలో మీ ఈస్టర్ వేడుకకు వారిని ఎలా సమీపించాలో మరియు ఎలా ఆహ్వానించాలో దేవుడిని అడగండి.
రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

The Story of Easter

ఈ వారం ఇక మీ జీవితంలోని చివరి వారం అని తెలిసినప్పుడు ఆ చివరి వారం మీరు ఎలా గడుపుతారు? యేసు మానవ రూపంలో భూమిపై జీవించిన చివరి వారము చిరస్మరణీయమైన క్షణాలతో, ప్రవచనాల నెరవేర్పుతో, సన్నిహిత ప్రార్థనతో, లోతైన చర్చతో, సూచక క్రియలతో మరియు ప్రపంచమును మార్చివేసే సంఘటనలతో నిండిపోయింది. ఈస్టర్ కు మునుపు సోమవారం ప్రారంభమవటానికి రూపొందించబడిన ఈ Life.Church యొక్క బైబిలు ప్రణాళిక, పవిత్రమైన వారములోని ప్రతిదినాన్ని ఒక కథానిక ద్వారా మీకు విశిదపరుస్తూ మిమ్మును నడిపిస్తుంది.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మీరు Life.Church గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి సందర్శించండి: www.Life.Church