ఈస్టరు కథనమూనా
మంగళవారం
ద్రాక్షతోట సన్నివేశములో, మనమెవరిమో తెలుసుకోవటం తప్పనిసరి. మనము తీగలము. మన ఒకే ఒక విధి ఏమనగా ద్రాక్షావల్లిని అనగా యేసుని, పట్టుకొని ఉండటం. ఇలా చేయడం ద్వారా మనము ఒకటే ప్రయోజనం నెరవేరుస్తాము: ఫలము కలిగియుండుట. ద్రాక్షతోటలో జరిగే ఇతర పనులన్నీ తోటమాలి చేత చేయబడతాయి. అది దేవుడు. నేను కాదు. నువ్వు కాదు. ద్రాక్షావల్లికి అనుసంధానమై ఉండి మన ద్వారా కార్యము చేయుటకు ఆయనకు అవకాశము ఇవ్వటమే మన పని. మీరు ఎవరో మరియు మీకు ఇవ్వబడిన పిలుపు ఏమిటని తెలుసుకొనుటకు ఈరోజే ధ్యానించండి. ఆయనపై ఆనుకొనివుండటం. ఆయనలో కొనసాగటం. ఆయనతో అనుసంధానించబడటం. ఆయనని పట్టుకుని ఉండటం. ఆయనలో నిలిచియుండటం. అంతే, మీరేమియూ లేదు.

ఈ ప్రణాళిక గురించి
ఈ వారం ఇక మీ జీవితంలోని చివరి వారం అని తెలిసినప్పుడు ఆ చివరి వారం మీరు ఎలా గడుపుతారు? యేసు మానవ రూపంలో భూమిపై జీవించిన చివరి వారము చిరస్మరణీయమైన క్షణాలతో, ప్రవచనాల నెరవేర్పుతో, సన్నిహిత ప్రార్థనతో, లోతైన చర్చతో, సూచక క్రియలతో మరియు ప్రపంచమును మార్చివేసే సంఘటనలతో నిండిపోయింది. ఈస్టర్ కు మునుపు సోమవారం ప్రారంభమవటానికి రూపొందించబడిన ఈ Life.Church యొక్క బైబిలు ప్రణాళిక, పవిత్రమైన వారములోని ప్రతిదినాన్ని ఒక కథానిక ద్వారా మీకు విశిదపరుస్తూ మిమ్మును నడిపిస్తుంది.
More
ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మీరు Life.Church గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి సందర్శించండి: www.Life.Church