ఈస్టరు కథనమూనా
శనివారము
ఆ స్త్రీ అత్తరుబుడ్డి పగులగొట్టి అత్తరు అంతా ఆయన తలమీద కుమ్మరించింది. తనకు విలువైన వస్తువును ఆమె విలాసముగా వ్యర్థపరచింది. ఆమె అత్తరుబుడ్డిని పగలగొట్టుటవలన అప్పుడైనా లేక మరెప్పుడైనా తన కోసము దానిని ఉపయోగించుకొనే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె తనకు ఉన్న అన్నిటినీ - గతాన్ని, వర్తమానాన్ని, మరియు భవిష్యత్తుని - ఆయనకు ఇచ్చింది. తన అద్భుతమైన ప్రేమను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని యేసు చెప్పాడు. ఆ తర్వాత ఆయన చివరి భోజన సమయములో ఇటువంటి మాటలు మరలా ప్రత్యక్షమయ్యాయి. ఆయన మనకొరకు తన శరీరాన్ని పగులగొట్టి తన రక్తాన్ని కుమ్మరించాడు. "నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుము", అనే యేసు మాటలు ఈసారి చదువుతున్నపుడు కేవలం రొట్టె మరియు ద్రాక్ష రసాలను మాత్రమే ఊహించుకోవద్దు. కమ్యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని మనస్సులో చిత్రీకరించుకోండి. దేనిని దాచకండి. నియంత్రణను పూర్తిగా విడిచిపెట్టండి. అదే యేసు చేసిన క్రియలను నిజంగా జ్ఞాపకము చేస్తుంది. ఒక ఆచారములా ఆచరించకుండా, దీనిని ఒక స్మారకముగా చేయాలి. "పగులగొట్టబడి కుమ్మరించబడటము" మీ జీవితములో దేనికి నిదర్శనంగా ఉండాలి?

ఈ ప్రణాళిక గురించి
ఈ వారం ఇక మీ జీవితంలోని చివరి వారం అని తెలిసినప్పుడు ఆ చివరి వారం మీరు ఎలా గడుపుతారు? యేసు మానవ రూపంలో భూమిపై జీవించిన చివరి వారము చిరస్మరణీయమైన క్షణాలతో, ప్రవచనాల నెరవేర్పుతో, సన్నిహిత ప్రార్థనతో, లోతైన చర్చతో, సూచక క్రియలతో మరియు ప్రపంచమును మార్చివేసే సంఘటనలతో నిండిపోయింది. ఈస్టర్ కు మునుపు సోమవారం ప్రారంభమవటానికి రూపొందించబడిన ఈ Life.Church యొక్క బైబిలు ప్రణాళిక, పవిత్రమైన వారములోని ప్రతిదినాన్ని ఒక కథానిక ద్వారా మీకు విశిదపరుస్తూ మిమ్మును నడిపిస్తుంది.
More
ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మీరు Life.Church గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి సందర్శించండి: www.Life.Church