BibleProject | ఆగమన ధ్యానములుSample
బైబిల్ ఆనందం అనేది యేసు యొక్క స్వంత జీవితం మరియు ప్రేమ యొక్క శక్తిపై విశ్వాసం మరియు ఆశ యొక్క లోతైన నిర్ణయం.
యేసు ప్రేమ మరణాన్ని కూడా అధిగమించిందని మీరు విశ్వసిస్తే, చీకటి పరిస్థితులలో కూడా ఆనందం సమంజసంగా మారుతుంది. మీరు దుఃఖాన్ని విస్మరించాలని లేదా అణచివేయాలని దీని అర్థం కాదు. అలా చెయ్యడం ఆరోగ్యకరమైనది కాదు, అవసరమైనది కాదు. ప్రియమైన వారిని లేదా తన స్వంత స్వేచ్ఛను కోల్పోయినందుకు పౌలు తరచుగా తన బాధను వ్యక్తం చేశాడు. అతడు దానిని దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము అని పిలిచాడు. అతడు తన బాధను గుర్తించినప్పుడు, యేసు యందు విశ్వసించుటకు ఎన్నుకోవడం ద్వారా తన నష్టానికి అంతిమ పదం ఉండదని నమ్మాడు.
చదవండి:
2 కొరింథీయులు 6:10
పరిశీలించు:
మీ జీవితంలో మీరు దుఃఖంతో నిండినప్పటికీ, పూర్తిగా సంతోషించగలిగిన సమయాన్ని మీరు గుర్తుచేసుకోగలరా? అలా అయితే, మీరు ఆ అనుభవాన్ని ఎలా వివరిస్తారు?
దేవునిని ప్రార్థించడానికి ఇప్పుడు ఒక క్షణం కేటాయించండి. తీవ్రమైన బాధను అధిగమించగల అయన ఆనందానికి ధన్యవాదాలు. బాధల మధ్య ఎలా సంతోషించాలో నేర్పించడానికి ఆయనను ఆహ్వానించండి. మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఆయనతో నిజాయితీగా చెప్పి, మీకు ఏమి కావాలో ఆయనను అడగండి.
Scripture
About this Plan
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More