YouVersion Logo
Search Icon

BibleProject | ఆగమన ధ్యానములుSample

BibleProject | ఆగమన ధ్యానములు

DAY 20 OF 28

యేసు తన అనుచరులకు ఇలా బోధించాడు, “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును."" యేసు బోధనలో, నిజమైన ఆనందం అత్యంత క్లిష్ట పరిస్థితులను తట్టుకోగలదని చూడగలం, ఎందుకంటే ఇది పరిస్థితులపై ఆధారపడి ఉండదు. ఇది దేవునిపై మరియు అయన ప్రజల నిత్యమైన భవిశ్యత్తుకొరకైనా వాగ్ధానాలపై ఆధారపడి ఉంటుంది

 

చదవండి:


మత్తయి 5: 11-12, అపొస్తలుల కార్యములు 13: 50-52, హెబ్రీయులకు 12: 1-3


పరిశీలించు:


ఈ వాక్య బాగముల ప్రకారం, బాధాకరమైన మరియు బెదిరింపు పరిస్థితులలో కూడా ఆనందం ఎలా నిలవగలదు? 


హెబ్రీయులకు 12: 1-3 సమీక్షించడానికి సమయాన్ని వెచ్చించండి. యేసు చాలా బాధను భరించాడు ఎందుకంటే అయన తన బాధను మించిన గొప్ప ఆనందాన్ని చూడగలిగాడు. ఈ వాక్య భాగములో, యేసు అనుచరులు యేసుపై వారి దృష్టిని నిలిపి, కష్టాలను భరించుటకు పిలువబడ్డారు; యేసు వారి ముందు ఉంచబడిన ఆనందం అవుతాడు. ఆచరణాత్మకంగా              "" యేసువైపు చూచుచు"" అంటే మీరు ఏమనుకుంటున్నారు?    


మీ పరిశీలనలును మీ హృదయం నుండి దేవునికి ప్రార్థనగా మార్చండి.


Day 19Day 21

About this Plan

BibleProject | ఆగమన ధ్యానములు

యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.

More