BibleProject | ఆగమన ధ్యానములుSample
బైబిల్ దేవుడు ప్రేమను వ్యక్తపరచడమే కాదు, ఆయనే ప్రేమై ఉన్నాడు. త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుదాత్మగా, అయన ఎల్లప్పుడూ ఇతరులకొరకు, స్వీయ-దాతగా, సహవాసం చేయువాడిగా ఉన్నాడు మరియు ఉంటాడు. ప్రేమ ఆయన లక్షణాలలో ఒకటి మాత్రమే కాదు. ప్రేమ అనేది ఆయన స్వభావం. కుమారుడైన యేసు, దేవుని ప్రేమను పూర్తిగా కలిగి ఉన్నాడు మరియు మానవత్వం తరపున తన ప్రాణమును అర్పించినప్పుడు దానిని చాలా స్పష్టంగా ప్రదర్శించాడు. ప్రజలు తమ పట్ల యేసు ప్రేమను విశ్వసించడం నేర్చుకున్నప్పుడు, వారు దేవుని ప్రేమ సంఘంలో చేరతారు, మరియు వారి స్వభావం ఆయనతో ఇతరులను ప్రేమించేలా రూపాంతరం చెందుతుంది.
చదవండి:
1 యోహాను 4: 8, 1 యోహాను 4:16, 1 యోహాను 3:16, యోహాను 15: 9-13
పరిశీలించు:
సమీక్ష 1 యోహాను 4:16. దేవుడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని విశ్వసించడం నేర్చుకున్నారా?
అలా అయితే, అయన ప్రేమను అందుకున్న మీ అనుభవాన్ని వివరించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు పూర్తిగా విశ్వసించడం మొదలుపెట్టినప్పటి నుండి మీ జీవితంలో ఏమి మారింది? ఈ రోజు మీరు అయన ప్రేమను ఎవరితో ఎలా పంచుకోవచ్చు?
కాకపోతే, మీ పట్ల దేవుని ప్రేమను పొందడానికి మీరు ఎలా కష్టపడ్డారో వివరించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు పూర్తిగా విశ్వసిస్తే మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు?
యోహాను 15: 9 ని సమీక్షించండి. దేవుడు యేసును ఎంతగా ప్రేమిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? యేసు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనే ఆలోచనను పరిశీలించండి. మీరు దీని గురించి ఆలోచించినప్పుడు ఏ ప్రశ్నలు, ఆలోచనలు లేదా భావాలు వస్తాయి?
యేసు తన ప్రేమను మీరు నివసించే లేదా ""నిలిచి"" ఉండే ప్రదేశంతో పోల్చాడు. నిజంగా అక్కడైనా నివసించడానికి, మీరు ముందుగా లోపలికి వెళ్లాలి, మీ సామాన్లు విప్పాలి, ఆ ప్రదేశానికి అలవాటు పడాలి మరియు దానిలో హాయిగా పనిచేయడం నెర్చుకోవలి. మీరు ఇంకొక చోట నివసిస్తున్నప్పుడు ఇంకా ఏమి చేస్తారు? మీపై యేసుకు ఉన్న ప్రేమలో మీ విశ్వాసమును దీనితో ఎలా పోల్చవచ్చు?
మీ పఠనం మరియు పరిశీలన ప్రార్థనను ప్రేరేపించనివ్వండి. అయన ప్రేమ మిమ్మల్ని ఎలా ఆశ్చర్యపరుస్తుందనే దాని గురించి దేవునితో మాట్లాడండి, దాన్ని స్వీకరించడానికి మీరు ఎలా కష్టపడుతున్నారో యథార్థముగా చెప్పండి మరియు ఈ రోజు మీపై ఆయనకున్న ప్రేమను మీరు విశ్వసించడానికి ఏమి అవసరమో, అడగండి
About this Plan
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More