YouVersion Logo
Search Icon

BibleProject | ఆగమన ధ్యానములుSample

BibleProject | ఆగమన ధ్యానములు

DAY 26 OF 28

అగాపే ప్రేమ అనేది ప్రధానంగా ప్రజలకు కలిగే భావన కాదు. ప్రేమ ఒక చర్య. ఇతరుల శ్రేయస్సు కోసం ప్రజలు చేసే ఎంపిక ఇది. అపొస్తలుడైన పౌలు, తన పత్రికలలో ఒకదానిలో, ఆధ్యాత్మిక జ్ఞానం లేదా ప్రత్యేక సామర్ధ్యాలను కలిగి ఉండటం కంటే ప్రేమ చాలా ముఖ్యం మరియు అది లేకుండా ఏదీ నిజంగా ప్రాముఖ్యమైనది కాదని చెప్పాడు. ప్రేమ ఎలా ఆలోచిస్తుందో మరియు ఎలా ప్రవర్తిస్తుందో అయన ఖచ్చితంగా వివరిస్తాడు.   


చదవండి:


1 కొరింథీయులు 13: 1-7


పరిశీలించు:


కాగితంపై 1 కొరింథీయులు 13: 4-7 వ్రాయండి. మీరు మీ స్వంత చేతివ్రాతలో వ్రాసేటప్పుడు, ఏ పదాలు లేదా పదబంధాలు మీకు ప్రత్యేకంగా నిలుస్తాయి?


మీరు ప్రేమలో ఏయే అంశాలలో ఎక్కువగా పెరగాలి? దేవునికి చెప్పండి మరియు అతని సహాయం కోసం అడగండి. 


 పౌలు యొక్క ప్రేమ నిర్వచనాన్ని ఉపయోగించి, యేసు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడో పరిశీలించండి. ఉదాహరణకు, యేసు మీ పట్ల ఎలా సహనంతో, దయతో, వినయంగా మరియు నిస్వార్థంగా ఉన్నాడు?


నేడు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని మీరు ఎవరికి గుర్తు చేయాలి? ఈ వారం యేసు తన ప్రేమను మీ ద్వారా ఎలా పంచుకోవాలనుకుంటున్నారు? దాని గురించి ప్రార్థించడానికి కొంత సమయం కేటాయించండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మనసులో ఏవైనా ఆలోచనలు వస్తే వాటిని వ్రాసి, ఈ వారం అయన ప్రేమను చురుకుగా పంచుకునేందుకు ఒక ప్రణాళికను రూపొందించండి. 


Day 25Day 27

About this Plan

BibleProject | ఆగమన ధ్యానములు

యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.

More