YouVersion Logo
Search Icon

BibleProject | ఆగమన ధ్యానములుSample

BibleProject | ఆగమన ధ్యానములు

DAY 23 OF 28

పాత నిబంధన, హీబ్రూ బైబిల్లోని అతి ముఖ్యమైన ఆజ్ఞ గురించి యేసుని అడిగినప్పుడు, షెమా అని పిలువబడే ప్రాచీన ప్రార్థన నుండి "" నీవు నీ పూర్ణహృదయముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను  "" అని ఉటంకిస్తూ సమాధానం ఇచ్చాడు. కానీ అది మాత్రమే కాదు. హిబ్రూ బైబిల్ నుండి మరొక ఆజ్ఞ కూడా చాలా ముఖ్యమైనది, “నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను "" అని యేసు దాని తరువాత చెప్పాడు. కాబట్టి ఏది చాలా ముఖ్యమైనది? యేసుకు, రెండూ చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే రెండవ ఆజ్ఞను వినకుండా మొదటి ఆజ్ఞను పాటించలేము. అవి విడదీయరానివి. దేవుని పట్ల ఒక వ్యక్తికి ఉన్న ప్రేమ ఇతరులపై వారి ప్రేమ ద్వారా వ్యక్తమవుతుంది.  

 

చదవండి:


మార్కు 12: 29-31, ద్వితీయోపదేశకాండము 6: 5, లేవీయకాండము 19:18


పరిశీలించు:


హిబ్రూ బైబిల్ నుండి ఉటంకించిన తర్వాత యేసు చెప్పేదానిపై శ్రద్ధ వహించండి. మీరు అయన మాటలను పరిశీలించేటప్పుడు మీకు ఏ ప్రశ్నలు, ఆలోచనలు లేదా భావాలు వచ్చాయి?


ద్వితీయోపదేశకాండము మరియు లేవీయకాండము నుండి వాక్య భాగాలను సమీక్షించండి. మీరు ఏమి గమనిస్తున్నారు? ఈ రోజు ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?


మీ పరిశీలనను మీ హృదయం నుండి దేవునికి ప్రార్థనగా మార్చండి. 


Day 22Day 24

About this Plan

BibleProject | ఆగమన ధ్యానములు

యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.

More