జవాబుదారీతనంSample
సామర్ధ్యం మరియు కుటుంబం.
దేవుని రాజ్య స్థాపనలో కుటుంబం దేవుని విభాగం. గత శతాబ్దం నుండి భార్యా భర్తలు ఒకరి కొకరు సమర్పించుకోవటంలో ఎవరు ఎవరికి ఎవరు లోబడాలనే దానిపై ఎడతెగని వివాదం కలిగివున్నాం ప్రత్యేకంగా భారతదేశంలో, పితృస్వామ్య ఉమ్మడి కుటుంబానికి చెందినవారు, భర్తలు మరియు భార్యలు మరియు పిల్లలు స్వతంత్ర క్రెడిట్ కార్డు ఖాతాలకు వేరొక బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నపుడు లోలకం వేరొక విధంగా ఊపందుకుంది. మన కుటుంబం యొక్క ప్రతి సభ్యునికి ప్రత్యేక ఇమెయిల్ ఖాతాలు మరియు మొబైల్ టెలిఫోన్లు ఉన్నాయి.
బైబిలు, క్రెడిట్ కార్డులు మొబైల్ ఫోన్స్ గూర్చి మాట్లాడడం లేదు. బార్యాభర్తలు వివాహంలో ఒకటైనపుడు వారు వ్యక్తిగతమైన స్వాతంత్ర్యాన్ని, పారదర్శకతను ఒకరి ఎడల ఒకరు కలిగివుండగలమని దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తున్నారు. మనం మనకున్నదంతటిని మన భాగస్వామితో పంచుకోగలమని అంగీకరిస్తున్నాం. అలాగైనపుడు మనం మన ఇ-మెయిల్స్ ఫోన్ కాల్స్ ఎస్ ఎం ఎస్ లు పంచుకోకపోతే మన జవాబుదారీతనం కొరవడినదానికి నిదర్శనమై యుంది.
తల్లిదండ్రులుగా ఒకరికొకరం జవాబుదారులమైయున్నపుడు పిల్లలు కూడా జవాబుదారీతనాన్ని కలిగి వుండడం సహజం మరియు మంచిదై యుంటుంది. తమ కుటుంబ యజమాని ఎక్కడికెళ్ళి వుంటాడో ఇంట్లో ఎవరికీ తెలియని స్థితిలో వున్న అనేక కుటుంబాలు నాకు తెలుసు. మరి! మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారో, ఎటు నుండి వచ్చారో మనకు తెలియజేయడంలో వారు సానుకూలత కలిగివుండగలగాలి. దీనికీ తల్లిదండ్రులు బాధ్యులు కాగలరు.
దేవుడు మనకిచ్చిన కుటుంబాలను సంరక్షించి భధ్రపరచడం భార్యలు/భర్తల ప్రాముఖ్యబాధ్యతయై యుంది. మన పిల్లల జీవితాలకు మనం జవాబుదారులం. మాట చేత క్రియ చేత వారిని క్రీస్తు వద్దకు నడిపించుటలో మనం జవాబుదారులం.
వృద్ధుల గృహంలో ఉన్న సామ్ భార్య యొక్క ఈ పదునైన కథ ఉంది. ఆమె అల్జీమర్స్ మరియు ప్రతిరోజు సామ్ ఉదయం ఆమెను సందర్శిస్తున్నాడు, ఆమె పడకగదిలో కూర్చుని, ఆమె పక్కన తన పుస్తకాన్ని చదివేవాడు. మరియు మంచం సర్ది సహాయం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. అతనిని అతని భార్య తన భర్తని కూడా గుర్తించలేనంతగా స్పృహలో లేదని తెలుసుకున్న రోజున, హెడ్ నర్స్ అతన్ని నీ భార్య నిన్ను కనీసం గుర్తించలేని స్థితిలో వుండగా నీవు ఈ రావడం, ఏదో చదివి వినిపించడం, సర్దడం ఇవన్నీ ఎందుకు అని అడిగింది "మంచిది, ఆమె నా భార్య, ఆమె నన్ను గుర్తించలేకపోయినా నేను ఇంకా ఆమెను గుర్తించగలను గదా !! వివాహ ప్రమాణంలో మన ప్రమాణాలను చేసుకున్నప్పుడు. "మన జీవిత భాగస్వాములతో మనము కట్టుబడి వుండే బాధ్యత యొక్క స్థాయి ఇదే కాగలదు.
దిన తలంపు:
ఒకరికొకరు సమర్పితులమై యుండడం ద్వారా మాత్రమే కుటుంబంలో కలిసివుండగలం.
ప్రార్ధన:
ప్రేమగల ప్రభువా, నేను నా కుటుంబ సభ్యులతో కొనసాగవలసిన ప్రేమ సంబంధంలో నా అహమును దూరపర్చండి. మీ వుద్దేశ్యాలకొరకు వాడబడే క్రమంలో మేము మరింతగా బలపడునట్లుగా మమ్మును మీ ప్రేమతో బంధించండి
Scripture
About this Plan
సాధారణంగా మనుష్యులందరూ, ప్రత్యేకంగా క్రైస్తవులు దేవునికి, తమ కుటుంబాలకు, స్నేహితులకు, నాయకులకు, పనిచేసే చోట మన బృందాలకు ఆయా స్థాయిలలో మనం జవాబుదారులమై యుంటాం. అయితే సహజంగా మానవ స్వభావానికి ఈ లక్షణం అంతగా రుచించదు. దేవుని పట్ల జవాబుదారులమై యుండడం ప్రాధమికమైనదై ఇతర అన్ని కోణాలను బలపరుస్తుంది,
More