జవాబుదారీతనంSample
దేవునికి జవాబుదారులమై యుండుట – నా జీవితానికి ప్రభువెవరు?
జవాబుదారులమై యుండడం అనేది మనుష్యులెవరికే గానీ అంతరంతరాల్లో అంతగ నచ్చదు. వృత్తి, ఉద్యోగాల కౌన్సిలింగ్ మార్గ దర్శక తరగతుల్లోఅనేక మంది యవనస్తులను నేను కలుసుకొంటూ వుంటాను. వారు తమ జీవితంలో ఏం చెయ్యగోరుతుంటారో ఆయా విషయాలపై కొన్ని ప్రశ్నలను చర్చిస్తూ వున్నపుడు వారు ముందుగానే ఏదేని స్వంత వ్యాపారం ప్రారంభించాలనె ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఎందుకు అంటే ? తమకు తామే బాస్ కావచ్చుఅనే జవాబు ఇస్తూవుంటారు. మరొకరికి జవాబుదారులమై యుండడానికి ఇష్టపడకపోవడం మానవ స్వభావ లక్షణమైయుంది.
దేవునికి జవాబుదారులమై యుండే క్రమంలో మన మొట్ట మొదటి బాధ్యత మనం యేసు ప్రభువు యొక్క అధికారాన్ని మన జీవితంలో అంగీకరించాలి. ఒక దైవ జనుడు తన ప్రయాణాలలో తనను వారి గృహాలలో చేర్చుకొనే మూడు కుటుంబాలను గూర్చి నాతో ఈ విధంగా చెప్పాడు. ఒక కుటుంబం ఆయనకు ఒక ప్రత్యేకమైన కొన్ని సౌకర్యాలతో గూడిన వసతిని ఏర్పాటు చేసారు. రెండవ గృహస్థు, ఒక సాధారణమైన రీతి సౌకర్యాలతో వసతినేర్పాటు చేస్తాడు. ఇక మూడవ ఇల్లు చూస్తే ఈ యావత్తు ఇల్లు మీదే మీకు అవసరమైన రీతిగా వాడుకోండి అన్నారు. ఈ విధమైనట్టి పరిమితుల్లేని జవాబుదారీ తనంతో మనం మన జీవితాలను యేసుకు సమర్పించాలి.
దేనికి మనం జవాబుదారులం ? [మత్తయి 12 : 36]. బైబిలు ఈ విధంగా చెబుతుంది మనం పలికే ప్రతి మాటకు మనం దేవునికి జవాబుదారులమై యుంటాం మనం పనిచేసే చోట మన అధికారం క్రింద వున్న ప్రజలకు మనం జవాబుదారులమై యున్నాం. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు, భర్తయైతే భార్యకు, భార్య తన భర్తకు దేవుని ఎదుట మనం మనం మన కుటుంబాలకు జవాబుదారులమై యున్నాం. మన దైనందిన జీవితాల్లో ఎవరితో సంబంధం కలిగివుంటామో వారందరికీ జవాబుదారులమైయుంటాం. తద్వారా వారు మనలో యేసు ప్రేమను చూడగలరు.
దేవుని తోడి మన నడకలో, దేవుని నుండి దాగివుండగల విభాగం ఏదీ వుండదు సమస్తం ఉన్నదున్నట్లుగా ఆయన చూడగలడు. చాలాసార్లు ఈ విషయాన్ని గ్రహించడంలో మనం విఫలమవుతుంటాం మన జీవితంలో ఉన్న భాగాలను మనము పరిగణలోకి తీసుకుంటాము మరియు వాటిని లెక్కించటంలో సంతృప్తి చెందుతాము, కానీ మనము లేని భాగాలు లెక్కించలేకపోతున్నాము. క్రీస్తు అధికారంలోనికి మన జీవిత విభాగాలన్నిటిని క్రమక్రమంగా తీసుకువచ్చినప్పుడు, మన బాధ్యత మెరుగవుతుంది మరియు సులభతరమవుతుంది.
నేటి దిన తలంపు:
దేవుని అధికారానికి మన సమర్పణ / విధేయత క్రీస్తులో మన స్వాతంత్రానికి మరియు ఆయన కోసం మనము సాధించగలిగే దానికి కీలకమై యుంటుంది.
ప్రార్ధన:
యేసు ప్రభువా, నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తూ వున్నాను నా జీవితానికి అందలి ప్రతి భాగానికి నీవు ప్రభువై యుండుము, నీ బిడ్డగా ఈ లోకంలో నీ మహిమను ప్రతిఫలింప జేయుటలో నా బాధ్యతను నన్ను గ్రహించ నీయుము.
About this Plan
సాధారణంగా మనుష్యులందరూ, ప్రత్యేకంగా క్రైస్తవులు దేవునికి, తమ కుటుంబాలకు, స్నేహితులకు, నాయకులకు, పనిచేసే చోట మన బృందాలకు ఆయా స్థాయిలలో మనం జవాబుదారులమై యుంటాం. అయితే సహజంగా మానవ స్వభావానికి ఈ లక్షణం అంతగా రుచించదు. దేవుని పట్ల జవాబుదారులమై యుండడం ప్రాధమికమైనదై ఇతర అన్ని కోణాలను బలపరుస్తుంది,
More