YouVersion Logo
Search Icon

జవాబుదారీతనంSample

జవాబుదారీతనం

DAY 5 OF 7

పనిలో జవాబుదారీతనము – యాజమాన్యం మరియు ఉత్పాదకత 

 నేటి ప్రపంచంలో వుద్యోగాలు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. నైపుణ్యం గలిగిన మంచివారు దొరకడం చాలా కష్టమైన విషయం. ఇందును బట్టి కొన్నిసార్లు యువకులు ఎక్కువ సంపాదన మరియు తక్కువ జవాబుదారీతనం గలిగిన వుద్యోగాలను కోరుకొంటారు. యేసును వెంబడించే వారు ఇక్కడ కూడా తమ ప్రత్యేకతను చూపించాలి. ఎంతో శ్రేష్టమైన మరియు నాణ్యమైన పనినందించడానికి నా తండ్రి ఎంతో కష్ట ప్రయాసలతో పని చేయడం నాకు తెలుసు అది నేనెంతో ప్రేమించే విషయమై యుంది. 

 గత 20 ఏళ్ళలో, ప్రపంచ ఆర్ధికవ్యవస్థలో భారతదేశం పెద్ద ప్రగతి సాధించింది. అందును బట్టి మనం ఎంతో సగర్వంగా మరియు ఆత్మవిశ్వాసంతో వుంటాం. మనము ఉత్పత్తి చేసే దాని నాణ్యత దృష్ట్యా మనము ముందుకు వెళ్ళడానికి చాలా గొప్ప విధానాలను కలిగివుండాలని గుర్తుంచుకోవాలి. క్రైస్తవులమైన మనం మనం చేసే పనిలో మనం ఒక వ్యత్యాసాన్ని చూపించాలి. ఒక మూల పనిచేసే నేను ఆ చిన్నమూలలో నా వెలుగును ప్రకాశింపజేస్తూ వున్నానా ? ప్రజలు నన్ను ఒక బెంచి మార్కుగా గుర్తించగలరా? క్రైస్తవులుగా మనం చెయ్యవలసింది ప్రయాసతో కూడిన శ్రేష్టమైన పనిని అందించడం మాత్రమే కాదు, ఇది మన జీవిత విధానమై యుండాలి. 

 క్రైస్తవులమైన మనకు అవసరమైన జవాబుదారీతనం యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే మనం బాధ్యత లేదా యాజమాన్యాన్ని అంగీకరించడం, మొదటిసారిగా మన పూర్వీకుడైన ఆదాము తాను బాధ్యత వహించవలసిన సందర్భంలో సిగ్గు లేకుండా తన భార్య అయిన హవ్వపై నేరాన్ని పెట్టేసాడు (ఆదికాండం 3: 11-13). త్వరలోనే, ఈవ్ తన పాపాన్ని సర్పంపై వేసింది. విషయాలు అడ్డం తిరిగినపుడు బాధ్యత తీసుకొనకుండా దాట వెయ్యడం మానవ సహజం. 

 సౌలు మరియు దావీదు వారు చేసిన పాపాల విషయంలో దేవుని గద్దింపుకు వారు ప్రతిస్పందనలోని విలక్షణమైన వైవిధ్యాన్ని కనుగొనగలం. I సమూయేలు 15 లో, అమాలేకీయులను నాశనం చేయనందుకు సమూయేలు సౌలును ఎదుర్కొనినపుడు సౌలు తన సైన్యంపైకి నిందను నెట్టివేసి, తనను తాను సమర్ధించు కున్నాడు. మరోవైపు, దావీదును [II సమూయేలు 12 ] ప్రవక్త నాతాను ఎదుర్కొన్నప్పుడు, తన పాపానికి మరియు తన చర్యలకు బాధ్యత వహించాడు. 

 కార్పొరేట్ ప్రపంచంలో కూడా, పదవీ అధికారాలలో విషయాలు తప్పుగా ఉన్నప్పుడు జవాబుదారీతనతో విషయాలపై బాధ్యత తీసుకోవలసిన అవసరం ఉందని మన గుర్తించలేకపోతున్నాము. ప్రభుత్వం లేదా కార్పొరేట్ ప్రపంచంలో తమ తప్పులు వేరొకరివి అన్నట్టు కాక అవి తమ స్వంతం అనుకొనే అధికారులు చాలా కొద్దిమంది వ్యక్తులు ఉంటారు. మనము తప్పు చేసినపుడు దానిని అంగీకరిస్తేనే దాని నుండి నేర్చుకోగల సామర్థ్యం మనకు ఉంటుంది. 

దిన తలంపు: 

విషయాలు తప్పైనా ఒప్పైనా క్రైస్తవుడు వాటిపై బాధ్యత వహించడానికి సంసిద్దంగా వుండాలి. 

ప్రార్ధన: 

యేసుప్రభువా నా పనిపై సరియైన వైఖరిని నాకు దయచెయ్యండి దానిని ఇతరులు కనుగొని నిన్నుమహిమ పరచునట్లు నా చేతుల పనిని అభివృద్ధి చెయ్యండి. 

Day 4Day 6

About this Plan

జవాబుదారీతనం

 సాధారణంగా మనుష్యులందరూ, ప్రత్యేకంగా క్రైస్తవులు దేవునికి, తమ కుటుంబాలకు, స్నేహితులకు, నాయకులకు, పనిచేసే చోట మన బృందాలకు ఆయా స్థాయిలలో మనం జవాబుదారులమై యుంటాం. అయితే సహజంగా మానవ స్వభావానికి ఈ లక్షణం అంతగా రుచించదు. దేవుని పట్ల జవాబుదారులమై యుండడం ప్రాధమికమైనదై ఇతర అన్ని కోణాలను బలపరుస్తుంది, 

More