జవాబుదారీతనంSample
ఏ విధంగానైనా అది ఎవరి ధనం ?
ఇక్కడొక ఛలోక్తి చూడండి ....ధనం సమస్త కీడులకు మూలం అని వుంది. కానీ మనిషికి ఆ మూలం కావాలి. “మనం క్రీస్తును అనుసరించినా లేకపోయినా మనకు డబ్బు అవసరం. ధన సంపదను పరిగణించె విషయంలో క్రైస్తవునికి క్రైస్తవేతరునికి మధ్య ఖచితంగా గుర్తించబడిన ఒక వ్యత్యాసం వుంది. లోక ప్రజలకైతే చావడానికైనా బ్రతకడానికైనా ధనమే వారికి సర్వం. యేసు ప్రభువును తమ స్వంత రక్షకునిగా స్వీకరించినవారికి ధనం కొద్ది కాలానికి మాత్రమే సంబందించినదై యుంటుంది. సామెతలు 23 : 5 లో వ్రాయబడిన విధంగా అది అదృశ్యమై పోయేదై యుంది, క్రైస్తవులుగా మనం దేవుణ్ణి సేవించదానికే ధనాన్నిఉపయోగించవలసి యుంటాం గానీ ఇతర విషయాల కొరకు కాదు. ధనం విషయాని కొచ్చేసరికి మనం దాన్ని వదిలించుకొని స్వేచ్చగా వేలాడాలి.
ఇశ్రాయేలు ప్రజల ధనం పై దేవుని సర్వాధికారం దశమ భాగాలు తీసుకొనే విధానంలో అమలుజరిగింది. పాత నిబంధనకాలంలో కంటే ఎక్కువగా కొత్తనిబంధన విశ్వాసులుగా నేటి మనం దశమ భాగాలుచెల్లించడాన్ని ప్రోత్సహిస్తున్నాం దశమ భాగాలు చెల్లిస్తూ క్రైస్తవులు మిగిలిన తొమ్మిది భాగాల విషయంలో స్వేచ్చ లేక మినహాయింపు పొందాం అనుకొంటున్నారు. వాస్తవానికి మన ఆశ కూడా ఇదే అయ్యుంది. దేవుడే మనకు ఆస్తిని అనుగ్రహించేవాడు మరియు మన ఆస్తి అంతటికీ ఆయనే ప్రభువనే సత్యాన్ని గుర్తించడంలో మనం విఫలమవుతున్నాం. ఆయన మనకిచ్చిన సమస్తమంతటితో మనల్నిదీవించిన దేవునికి మనం మన యావత్తు ఆస్తిని గూర్చి జవాబుదారులమై యున్నాం.
నేటి సమాజంలో మనం ఏది కొనాలన్నా, ఎప్పుడు కొనాలన్నా క్రెడిట్ కార్డు సౌలభ్యాన్ని కలిగివున్నాం. అయితే దేవుడు మనల్నిఆస్తి సంపాద్యాలతో దీవించాలని మనం కోరినపుడు మన డబ్బు వినియోగంపై ప్రభువు యొక్క ఆమోదం ఎంతవరకూ ఉందనేది మనం మరిచిపోకూడదు. ఈ లోకంలో తన రాజ్యాన్ని నిర్మాణంలో సహాయపడేందుకు మనకు దేవుడు ఐశ్వర్యాన్నిఇస్తాడనే విషయాన్ని మనం గ్రహించినపుడు డబ్బు విషయంలో మన యావత్తు వైఖరి మారిపోతుంది సామెతలు 10 : 22
నమ్మకమైన క్రైస్తవ గృహ నిర్వాహకులమై క్రైస్తవపరిపక్వతతో ద్రవ్యాన్నివినియోగించగలమనే నమ్మకంతో దేవుడుమనకు ఐశ్వర్యాన్నిస్తాడనే సత్యాన్ని అనేక సంవత్సరాలుగా నేను నేర్చుకొంటున్నాను. ఈ విధంగా మన చుట్టు నున్న అనేకులు మన ద్వారా దీవించబడాలని, ఈ లోకంలో దేవుని రాజ్యం స్థాపించబడాలని దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తూవున్నాడు.
ఈ రోజు తలంపు :
లోకంలోని ఇతర విధాలుగా కాక ప్రజలను ప్రేమించు, డబ్బు ఖర్చు పెట్టు
ప్రార్ధన :
ప్రభువు ధనాన్ని గూర్చి నాకు సరియైన వుద్దేశ్యాల్ని దయచెయ్యి డబ్బును ఒక సేవకుని వలే ఉపయోగించుటకు మరియు డబ్బుకు దాసోహం కాకుండుటకు సహాయం చెయ్యి. డబ్బు ఐశ్వర్యాల కొరకు కాక ఆశీర్వాదాలకు మూలముగా నిన్ను ఎంచడానికి నాకు సహాయం చెయ్యి.
Scripture
About this Plan
సాధారణంగా మనుష్యులందరూ, ప్రత్యేకంగా క్రైస్తవులు దేవునికి, తమ కుటుంబాలకు, స్నేహితులకు, నాయకులకు, పనిచేసే చోట మన బృందాలకు ఆయా స్థాయిలలో మనం జవాబుదారులమై యుంటాం. అయితే సహజంగా మానవ స్వభావానికి ఈ లక్షణం అంతగా రుచించదు. దేవుని పట్ల జవాబుదారులమై యుండడం ప్రాధమికమైనదై ఇతర అన్ని కోణాలను బలపరుస్తుంది,
More