YouVersion Logo
Search Icon

జవాబుదారీతనంSample

జవాబుదారీతనం

DAY 4 OF 7

మన ఉద్యోగాలలో జవాబుదారీ తనం కలిగివుండుట 

నేటి మిలేనియం మొదటి పాదంలో డాట్. కామ్ అనేది ఎంతగానో విస్తరించింది. ఈ వరవడిలో సి. ఇ. ఒ లు మరియు ప్రపంచ సంస్థల అధిపతులు వాటాదారుల పెట్టుబడులతో వ్యక్తిగత విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి వున్నందున స్టాక్ మార్కెట్ ధరలు కూలిపోయాయి. మిలియన్ల కొద్దీ వాటాదారులు తమ సంపద తుడిచి పెట్టుకుపోయిందని తెలుసుకొన్నపుడు అధికారులపై వారి కోపం కట్టలు తెంచుకొంది. భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరు, ఇన్ఫోసిస్ యొక్క CEO అయిన నారాయణమూర్తి, "ఒక సంస్థలో సభ్యులు ఉన్నతస్థాయిలో పెరిగేకొద్దీ, అధికారులకు ఎక్కువ అధికారం మరియు అధికారంతో పాటు ఎక్కువ జవాబుదారీతనం అవసరమవుతుందని గ్రహించారు. 

 మనం మన సంస్థలో ఉన్నత స్థితికి వెళ్ళేకొద్దీ మన జీవన విధానాలు మరింత పారదర్శకంగా వుండాలి. సంస్థలలో నాయకులుగా, మేనేజర్లగా వున్న వారి జీవితం, సాక్ష్యం తమ కొరకు, తమ క్రింద పనిచేసేవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. దావీదు పాపం చేసినపుడు అది ఇశ్రాయేలును దెబ్బతీసింది. అతడు గర్వించి యూదా ఇశ్రాయేలు గోత్రాల తలలను లెక్కించినపుడు వ్యాధి/జాడ్యం సంభవించాయి. ఆ శ్రమ నివారణకు దావీదు దేవుణ్ణి ఎంతగానో వేడుకోవాల్సి వచ్చింది. యేసును వెంబడించే మనం మనతో పని చేసే వారి విషయంలో బాధ్యులమై యుంటాం. నాయకులుగా మనం నీతి మరియు యధార్ధతలు కలిగి వున్నపుడు మన క్రిందివారు కూడా అలాగే వుంటారు. 

 మనతో పని చేసే మన తోటి ఉద్యోగులను మనం ఎలా చూస్తున్నాం, మనం వాడుకొనే మన పనివారిగా మన విజయాల కొరకు ఉపయోగపడే బంటులవలె మాత్రమే చూస్తున్నామా, వారి నిమిత్తం ఏ దేవునికి మనం లెక్కజెప్ప వలసియున్నామో ఆయన దృష్టిలో వారెంతో ప్రశస్తమైన వారిగా మనం చూస్తూవున్నామా ?నేటి కంపెనీలలో పనివారిని కొనడం, వారిపై కోపాన్నికుమ్మరించడం భారతదేశంలో సహా ఒక జీవన విధానంగా మారిపోయింది. యేసును వెంబడించే మనం ప్రత్యేకంగా జీవించడానికి పిలువబడ్డాం, మనం ఎవరినైనా వుద్యోగంలో పెట్టుకొన్నట్లయితే వారి నైపుణ్యాన్ని మెరుగుపరచి, వారిని నడిపిస్తూ ఇంకా వారి స్థిరత్వం కొరకు మనం ప్రణాళికలు రూపొందించాలి. వారు నిన్ను విశ్వసించవచ్చని ప్రజలు గ్రహించినపుడు, తమ యావత్ జీవితంతో నీ దేవున్ని తమ రక్షకునిగా అంగీకరించుటకు సంసిద్ధులవుతారు. 

దిన తలంపు: 

క్రైస్తవులుగా మన జీవనవిధానం మన విశ్వాసం మరియు మన నమ్మకాలపై కనబడాలి. 

ప్రార్ధన: 

ప్రభువా, నా పని స్థలంలో నా కార్యాలయంలో మరింత పారదర్శకంగా జవాబుదారీతనం గలిగి వుండుటకు నాకు సహాయం చెయ్యి. నీ చేత నీ వుద్దేశ్యాల కొరకు వాడబడు పాత్రగా మరియు నమ్మకస్తునిగా జీవించుటకు నన్ను బలపరచు. ఆమేన్.... 

Day 3Day 5

About this Plan

జవాబుదారీతనం

 సాధారణంగా మనుష్యులందరూ, ప్రత్యేకంగా క్రైస్తవులు దేవునికి, తమ కుటుంబాలకు, స్నేహితులకు, నాయకులకు, పనిచేసే చోట మన బృందాలకు ఆయా స్థాయిలలో మనం జవాబుదారులమై యుంటాం. అయితే సహజంగా మానవ స్వభావానికి ఈ లక్షణం అంతగా రుచించదు. దేవుని పట్ల జవాబుదారులమై యుండడం ప్రాధమికమైనదై ఇతర అన్ని కోణాలను బలపరుస్తుంది, 

More