హింసలో భయాన్ని ఎదిరించుటనమూనా

హింసలో భయాన్ని ఎదిరించుట

7 యొక్క 6

భయం కలిగే సందర్భాలలో ధైర్యముతో కూడిన ప్రతిస్పందనలు

భయాన్ని గెలవనివ్వకుండా క్రీస్తును రక్షించడానికి తమ ప్రాణాలను,ప్రతిష్ఠలను ధైర్యంగా పణంగా పెట్టిన ఇద్దరు బైబిల్ వీరుల గురించి నేను దృష్టి పెట్టాలనుకుంటున్నాను. వారిలో మొదటి వ్యక్తి, పాత నిబంధనలోని మోషే,రెండవ వ్యక్తి కొత్త నిబంధనకు చెందిన అరిమతయికి చెందిన యోసేపు.

శ్రమలను ఎదుర్కొన్నప్పుడు మోషే సత్య౦ కోస౦ దృఢ౦గా నిలబడ్డాడని మన౦ చూడవచ్చు;అతను ఫరో సన్నిధిని విడిచిపెట్టి,రాజభవనంలో పాపపు క్షణిక ఆనందాలను ఆస్వాదించడానికి బదులుగా మిద్యాను దేశంలో నివసించడానికి ఎంచుకున్నాడు. రాజభవనంలోని సుఖ సంపదలకంటే,శ్రమలలో ఉన్న దేవుని ప్రజలపై మాత్రమే ఆయన దృష్టి కేంద్రీకరించాడు. ఒకసారి భయంతో మిద్యానుకు పారిపోయిన అదే మోషే ఆ తర్వాత దేవుని ప్రజలను విడిపించమని కోరుతూ అదే ఫరో వద్దకు తిరిగి వెళ్ళడం కనిపిస్తుంది. దైవభక్తిలేని వాతావరణంలో పెరిగినప్పటికీ,తన గుర్తింపు గురించి, పిలుపు గురించి అతను పూర్తీ అవగాహన కలిగియున్నాడు. తన ప్రజల పక్షాన నిలబడితే తన పరిస్థితి ఏమిటని ఆయన చాలా భయపడి ఉండవచ్చు,కానీ అతను ఈ ప్రక్రియలో తన జీవితాన్ని,సుఖసౌఖ్యాలను,హోదాను మరియు భవిష్యత్తును పణంగా పెట్టి అలా చేశాడు.

కొన్నిసార్లు దేవుడు మనల్ని అసాధారణమైన పని చేయమని పిలుస్తాడు,ఆ అసాధారణమైన పనిలో ఎల్లప్పుడూ ప్రమాదాలే పొంచి ఉంటాయి. అలాంటి వారిలో అరిమతయికి చెందిన యోసేపు ఒకరు,అతను క్రీస్తు పట్ల తన ప్రేమ కోసం తన ప్రాణాలను సహితం లెక్క చేయలేదు. యేసు శిష్యుల౦దరూ భయంతో పారిపోయినప్పటికీ,ఆయన పిలాతు దగ్గరకు వెళ్లి యేసు శరీరాన్ని ఇవ్వమనిధైర్య౦గా అడిగాడు. తన జీవనోపాదియైన ఉద్యోగాన్నే కాదు, ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. భయంతో రహస్య విశ్వాసిగా ఉండేవాడు,కానీ ఇప్పుడు సిలువను చూసినందున,అతను ఇక దాక్కోలేదు!

కట్టుబడి,ప్రార్థించండి:

సాహసం చేసి, ఏదైనా గొప్ప పని చేయమని దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు,దాని కోసం మీరు తెగించగలరా?

ప్రభువు తన నామము కొరకు ఏవైనా సాహసాలు చేయడం కోసం తగినంత కృప మరియు ధైర్యముతో మిమ్మల్ని నింపాలని ప్రార్థించండి.

రోజు 5రోజు 7

ఈ ప్రణాళిక గురించి

హింసలో భయాన్ని ఎదిరించుట

ఎవరైనా హింసించబడుతున్నప్పుడు, ఆ సందర్భంలో భయపడడమనేది వారి అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలలో ఒకటి. దాడులు, జైలుకు తీసుకువెళ్ళడం, సంఘ భవనాలను మూసివేయడం, విశ్వాస౦వల్ల ప్రియమైనవారు, తోటి విశ్వాసులు మరణి౦చడ౦ ఇవన్నీ మన క్రైస్తవ ప్రయాణ౦లో ముందుకు సాగడానికి భయాన్ని, నిస్సహాయతను కలిగిస్తాయి. మీరు ఇప్పుడు భయపడుతున్నట్లయితే, హింసను ఎదుర్కొంటున్నప్పుడు భయాన్ని ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక చాలా గొప్పగా సహాయపడుతుంది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Persecution Reliefకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://persecutionrelief.org/