హింసలో భయాన్ని ఎదిరించుటనమూనా

హింసలో భయాన్ని ఎదిరించుట

7 యొక్క 3

భయం కలిగే సందర్భాలలో విజయం

మరణం బహుశా మనందరికీ ఉన్న అత్యంత భయానక భయాలలో ఒకటి. మరణ భయం,ముఖ్యంగా,హింసాత్మకమైన బెదిరింపులను ఎదుర్కొన్నప్పుడు శాంతిని కోల్పోతుంటాం. యేసు దానిని సిలువపై ఓడించాడు కాబట్టి మరణం మన శత్రువు కాదు. అప్పుడు మన౦ మరణానికి భయపడకూడదు,ఎ౦దుక౦టే క్రీస్తు యేసులో ఉన్న మన మీద దానికి ఎటువంటి అధికార౦ లేదు. మన శరీరాలు హి౦సను ఎదుర్కొ౦టున్నప్పటికీ,క్రీస్తు కోస౦ నిర్భయ౦గా జీవి౦చడానికి మరణ౦ మనల్ని అడ్డుకోదని మన౦ ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి.

భక్తుడైన యోహాను పత్మాసు ద్వీపంలో వేయబడిన తరువాత, అనేక బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొన్నాడు. బహుశా, మరణానికి సంబంధించిన అతి భయంకరమైన భయాన్ని కలిగి ఉండే ఆ సమయంలో,క్రీస్తును ఆయన పూర్తి మహిమతో చూసే అవకాశ౦ ఆయనకు ఉ౦డవచ్చు. యోహాను ఆ యేసు పాదాలపై వాలడానికి ఆ అద్భుత దృశ్యం సహాయపడింది. కానీ యేసు ఆయనెవరో గుర్తుచేశాడు! ఆయన మరణాన్ని ఓడించడమే కాకుండా,మరణం మరియు పాతాళం యొక్క తాళాలను కూడా కలిగి ఉన్నాడు. అందువల్ల,మీరు హింసకు మరియు మరణానికి భయపడే పరిస్థితిలో ఉన్నప్పుడు దానిపై విజయం సాధించిన మరియు కీలకంగా ఉన్న వ్యక్తిని గుర్తుంచుకోండి.

కట్టుబడి,ప్రార్థించండి:

మరణ భయం మిమ్మల్ని బాధిస్తోందా?మరణాన్ని ఓడించి,మరణం మరియు పాతాళం యొక్క తాళాలను కలిగి ఉన్న వ్యక్తిని మీరు గుర్తు చేసుకోగలరా?

హి౦స కలిగే చీకటి సమయాల్లో,భయ౦ మనల్ని ఆవరించకూడదని,క్రీస్తు యేసులో ఉన్నవారికి "మరణ౦ తన ముల్లును కోల్పోయి౦ది" అనే విషయం మనకు గుర్తుకు రావాలని ప్రార్థిద్దా౦.

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

హింసలో భయాన్ని ఎదిరించుట

ఎవరైనా హింసించబడుతున్నప్పుడు, ఆ సందర్భంలో భయపడడమనేది వారి అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలలో ఒకటి. దాడులు, జైలుకు తీసుకువెళ్ళడం, సంఘ భవనాలను మూసివేయడం, విశ్వాస౦వల్ల ప్రియమైనవారు, తోటి విశ్వాసులు మరణి౦చడ౦ ఇవన్నీ మన క్రైస్తవ ప్రయాణ౦లో ముందుకు సాగడానికి భయాన్ని, నిస్సహాయతను కలిగిస్తాయి. మీరు ఇప్పుడు భయపడుతున్నట్లయితే, హింసను ఎదుర్కొంటున్నప్పుడు భయాన్ని ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక చాలా గొప్పగా సహాయపడుతుంది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Persecution Reliefకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://persecutionrelief.org/