హింసలో భయాన్ని ఎదిరించుటనమూనా
భయం కలిగే సందర్భాలలో దేవుని స్వరం
కొన్నిసార్లు మన౦ చాలా భయానకమైన హింసాత్మకమైన పరిస్థితులలో ఉ౦డవచ్చు. చాలా సందర్భాల్లో,మనకు దాక్కోవడానికి ఎటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కాని మనము సేవి౦చే దేవుడే నిజమైన,సజీవమైన దేవుడని మన౦ ఎల్లప్పుడూ గుర్తు౦చుకోవాలి,ఆయన వచ్చి మీ భయాల మధ్య నిలబడి,మీరు ఎక్కడున్నారో అక్కడే నిలబడి మీకు "సమాధానము" ప్రకటిస్తారు. అదే మనం సేవిస్తున్న ప్రభువు గొప్పతనం. యేసు మనకు ఇచ్చే శాంతి సమస్త జ్ఞానానికి మించిన శాంతి;మన అన్ని పరిస్థితుల మధ్య మనం ఎల్లప్పుడూ ఆ శాంతిపై ఆధారపడాలి.“శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను;నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను;లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు;మీ హృదయమును కలవరపడనియ్యకుడి,వెరవనియ్యకుడి”అని ఆయన వాగ్దానం చేశాడని గుర్తుంచుకోండి.
అపొస్తలుడైన పౌలు తను వెళ్తున్న మార్గంలో ముందుకు ఎలా కొనసాగుతూ వెళ్ళాలనేదాని గురించి తాను కలిగియున్న అనేకమైన సందేహాల నడుమ పరిశుద్ధాత్మ తనతో ఎలా స్పష్ట౦గా మాట్లాడి౦దనే దానిని గురించి ఆయన ఎన్నోసార్లు సాక్ష్యమిచ్చాడు. అపొస్తలుల కార్యములు28లో,ప్రతి ఒక్కరూ నిరీక్షణను విడిచిపెట్టి మరణాన్ని పొందుతామని అనుకుంటున్నప్పుడు,పౌలు ప్రభువు యొక్క స్పష్టమైన స్వర౦తో ప్రోత్సహి౦చబడతాడు. ఆయనను ప్రోత్సహించడమే కాదు,తనతో మాట్లాడిన ప్రభువు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడనే నమ్మకాన్ని వ్యక్తం చేయడం ద్వారా తన సహచరులను కూడా ప్రోత్సహించగలిగాడు.
కట్టుబడి,ప్రార్థించండి:
మీ లోతైన భయాల మధ్య మీరు ఆయన శాంతిపై ఆధారపడగలుగుతున్నారా?మన భయాల నడుమ ఆయన సున్నితమైన స్వరం వినగలుగుతున్నామా?
మన౦ భయానక పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు,భయపడ్డప్పుడు,మన జీవిత పరిస్థితులలో "శాంతి" గురించి మాట్లాడగల మన ప్రభువైన యేసును గుర్తుకు తీసుకురావాలని ప్రార్థిద్దా౦.
ఈ ప్రణాళిక గురించి
ఎవరైనా హింసించబడుతున్నప్పుడు, ఆ సందర్భంలో భయపడడమనేది వారి అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలలో ఒకటి. దాడులు, జైలుకు తీసుకువెళ్ళడం, సంఘ భవనాలను మూసివేయడం, విశ్వాస౦వల్ల ప్రియమైనవారు, తోటి విశ్వాసులు మరణి౦చడ౦ ఇవన్నీ మన క్రైస్తవ ప్రయాణ౦లో ముందుకు సాగడానికి భయాన్ని, నిస్సహాయతను కలిగిస్తాయి. మీరు ఇప్పుడు భయపడుతున్నట్లయితే, హింసను ఎదుర్కొంటున్నప్పుడు భయాన్ని ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక చాలా గొప్పగా సహాయపడుతుంది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Persecution Reliefకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://persecutionrelief.org/