హింసలో భయాన్ని ఎదిరించుటనమూనా
భయం కలిగే సందర్భాలలో శరణుజొచ్చడం
దావీదు దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా పిలువబడ్డాడు,అయినప్పటికీ దావీదు అనేక పోరాటాలు చేశాడు. అతనికి చాలా మంది శత్రువులు ఉన్నారు,వారు అతని పేరును నాశనం చేయడానికి ప్రయత్నించారు;అతన్ని చంపడానికి కుట్ర పన్నారు. ఈ పరిస్థితులన్నిటిలో దావీదు ఎల్లప్పుడూ ప్రభువు వైపు చూశాడు. అన్యాయమైన అపవాదు మరియు భయానక పరిస్థితుల కారణంగా నిరంతర భయం మరియు నిద్రలేని రాత్రులు సాధారణమైపోయాయి,ఎందుకంటే మనల్నిహింసించేవారు మన ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తారు,దీనివల్ల మనము ప్రతి మలుపులో ఈ అన్యాయమైన బెదిరింపులను ఎదుర్కొంటాము. ఈ పరిస్థితుల్లో మనం ఒంటరిగా లేమనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వారు మన గురి౦చి అబద్ధాలు చెప్పినా,మనపై కుట్రలు పన్నినా,మన ప్రాణాలను తీయాలని ప్రయత్నించినా,మన దేవునిలో మనకు ఆశ్రయ౦ ఉ౦దని మన౦ గుర్తు౦చుకోవాలి. దావీదు దేవుని వైపు చూసినట్లే మనమూ దేవుని వైపు చూడాలి.
దావీదును కనిపెట్టి, చంపాలని సౌలు తన దూతలను దావీదు ఇంటికి పంపించిన సందర్భాన్ని కీర్తన 59:1-2 వచనాలు సూచిస్తున్నాయి.దావీదు ప్రాణాలతో బయటపడి పారిపోవాల్సి వచ్చింది. దావీదు ఆ సమయ౦లో పొంగిపోయి భక్తితో దేవునికి కేకలు వేశాడు. తాను ఆపదలో లేదా కల్లోలంలో ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మకు బలమైన దుర్గమని అతనికి తెలుసు. నేడు మన౦ ఎదుర్కొ౦టున్న పరిస్థితులలో దావీదు ను౦డి నేర్చుకు౦టా౦. మన శత్రువులు మనకు వ్యతిరేకంగా లేచినప్పుడు మనకు ఎదురయ్యే పరిస్థితులతో మనం ఉక్కిరిబిక్కిరి అవుతాము,కాని మన ప్రభువును ఎల్లప్పుడూ వేడుకోగలము,ఎందుకంటే ఆయన మనకు బలమైన దుర్గం మరియు మన కష్ట సమయాల్లో ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటాడు.
కట్టుబడి, ప్రార్థించండి:
హి౦స భయ౦ మిమ్మల్ని పట్టిపీడి౦చినప్పుడు మీరు ఎలా ప్రతిస్ప౦దిస్తారు?క్రీస్తు మీ బలమైన దుర్గంగా ఉన్నాడా?
మన శత్రువులు మనకు వ్యతిరేకంగా లేచి,మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న సమయాల్లో,మన ప్రభువును వేడుకుందాము మరియు ఆయనే మన బలమైన దుర్గంగా ఉండాలని,ఈ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు,మనం దేవుని వైపు చూస్తూ ఆయనలో ఆశ్రయం పొందాలని ప్రార్థిద్దాం.
ఈ ప్రణాళిక గురించి
ఎవరైనా హింసించబడుతున్నప్పుడు, ఆ సందర్భంలో భయపడడమనేది వారి అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలలో ఒకటి. దాడులు, జైలుకు తీసుకువెళ్ళడం, సంఘ భవనాలను మూసివేయడం, విశ్వాస౦వల్ల ప్రియమైనవారు, తోటి విశ్వాసులు మరణి౦చడ౦ ఇవన్నీ మన క్రైస్తవ ప్రయాణ౦లో ముందుకు సాగడానికి భయాన్ని, నిస్సహాయతను కలిగిస్తాయి. మీరు ఇప్పుడు భయపడుతున్నట్లయితే, హింసను ఎదుర్కొంటున్నప్పుడు భయాన్ని ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక చాలా గొప్పగా సహాయపడుతుంది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Persecution Reliefకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://persecutionrelief.org/