దేవునికి మొదటి స్థానం ఇవ్వండినమూనా
“జయజీవితం జీవించుటకు ఐదు విషయాల వ్యూహం.”
పాపం మరియు శోధనను విజయవంతంగా జయించటానికి అవసరమైన బైబిల్ ఆధారిత ఐదు విషయాలు ఈ విభాగంలో ఉంటాయి. ఈ ప్రణాళికను కార్యసాధకంగా చేయటం దేవునికి మీ జీవితంలో మొదటి స్థానం యిచ్చుటకు మరొక మార్గముగా ఉంటుంది!
1. యేసు క్రీస్తు కార్యము వలన దేవుడు నిన్ను పరిపూర్ణునిగా, పరిశుద్ధునిగా మరియు నిర్దోషిగా చూస్తున్నాడని అర్థం చేసుకోవాలి (2 కొరింథీ 5:21 చదవండి) చాలాసార్లు, అపరాధభావం మరియు అవమానం అనేవి పాపం యొక్క అత్యంత నాశనకరమైన ప్రతిఫలంగా ఉంటాయి. ఎటువంటి తప్పిదం చేసినప్పటికి, క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు అని అర్థం చేసుకొనుట అనేది విజయానికి పునాది (రోమా 8:1).
2. మీ పాపములు ఒప్పుకోవాలి. (1 యోహాను 1:9 చదవండి) మన పాపం ఒప్పుకొనటం అంటే ముందుగా మన మనసులో మరియు హృదయంలో ఉన్న పాపములను గుర్తించి వాటిని దేవుని వద్ద ఒప్పుకొనుట. మన పాపములను ఒప్పుకొనటం అంటే అందరి ముందూ వాటిని చెప్పడం అని అర్థం కాదు. ఒప్పుకోలు అనేది మీకు, దేవునికి మధ్య జరగాలి.
3. జవాబుదారీతనం కలిగి ఉండాలి. (యాకోబు 5:16 చదవండి) నీవు నమ్మగలిగిన ఒక సన్నిహిత క్రైస్తవ మిత్రుడిని, సంఘకాపరిని లేదా కుటుంబ సభ్యుడిని కలిగి ఉండటం అనేది మీ పోరాటంలో జవాబుదారీతనం మరియు ప్రార్థన సహకారములను పరిచయం చేయుటకు ఒక ప్రభావవంతమైన మార్గం.
4. శోధన మూలము నుండి తప్పించుకొనండి. (యాకోబు 1:13-15) చేయటానికి ఇది చాలా సవాలుతో కూడిన విషయం, ఇది చేయటానికి కొంత సృజనాత్మక ఆలోచన మరియు ప్రణాళిక అవసరం. సత్యం ఏమిటంటే, మీరు శోధనను తప్పించుకొనగలిగితే, మీరు పాపమును తప్పించుకొనగలరు.
5. దేవుని వాక్యాన్ని చదవండి. (కీర్తనలు 119:11 చదవండి) మనం “దీనిని మన హృదయాలలో భద్రపరచుకుంటే” మనకు ప్రత్యేకమైన బలము లభించి శోధన మరియు పాపమును తృణీకరించగలము.
ఈ ప్రణాళిక గురించి
మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అనేది ఏదో ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదు... ఇది ప్రతి క్రైస్తవునికి జీవిత కాలపు ప్రక్రియ. మీరు విశ్వాసములో క్రొత్తవారైనా, లేదా క్రీస్తును అనేక సంవత్సరాలుగా వెంబడిస్తున్నవారైనా, అర్థం చేసుకొని అవలంబించటానికి ఈ ప్రణాళిక మీకు సులభంగా ఉంటుంది. మరియు ఇది విజయవంతమైన క్రైస్తవ జీవితాలు జీవించటానికి అత్యంత ప్రభావవంతమైన ప్రణాళికగా ఉంటుంది. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సేకరించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te