దేవునికి మొదటి స్థానం ఇవ్వండినమూనా

దేవునికి మొదటి స్థానం ఇవ్వండి

5 యొక్క 4

“దేవుని సహాయంతో జీవిత పోరాటాలను గెలుచుట”

మన జీవితాల పట్ల జీవిత కాలపు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఒక ప్రక్క, మన పాత పాప స్వభావము యొక్క ప్రభావం- మనల్ని అంటిపెట్టుకుని ఉండే ప్రవర్తనలు, శోధనలు మరియు మనం జయించటానికి కష్టమైన కొన్ని పాపములు. కాలం గడుస్తున్న కొలదీ మనం ప్రభువుతో నడుచుటలో పరిపక్వత చెందుతున్నప్పుడు పాపస్వభావం యొక్క ప్రభావం బలహీనమవుతుంది. మరొక ప్రక్కన మన జీవితాల్లో నివసించే పరిశుద్ధాత్మ సన్నిధి యొక్క బలపడుచున్న ప్రభావం ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రికలో వర్ణించబడిన పరస్పర వ్యతిరేక శక్తులు ఇవే:

“నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయ కుందురు.” గలతీయులకు 5:16-17

“దేవుని ఆత్మ మూలంగా జీవించాలి” అని దేవుని వాక్యం మనలను ప్రోత్సహిస్తుంది. మరొక మాటలో, మన జీవితాల్లో ఉన్న పాప స్వభావం యొక్క ప్రభావమును పరిశుద్ధాత్మ ప్రభావము లోబరచుకునే విధంగా మనం సహకరించాలి.

చాలా సార్లు, ఇది చెప్పినంత సులభమైన పనికాదు. స్వార్థపూరితమైన లక్ష్యాలు మరియు అసలు నెరవేర్చుకునే విధంగా నిర్ణయాలు తీసుకొనటానికి మన పాప స్వభావం మనల్ని ఒత్తిడి చేస్తుంది. దీనినే శోధన అంటాము, మరియు యాకోబు దీనిని ఇలా వివరిస్తున్నాడు:

“దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.” యాకోబు 1:13-14

మన తరపు నుండి ఆ శోధన ప్రకారం చేయటానికి నిర్ణయం చేసుకునే వరకు అది పాపముగా మారదు.

“దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” యాకోబు 1:15

ఏదేమైనా అద్భుతమైన విషయం ఏమిటంటే, దేవుని బలమైన ప్రేమ మరియు కృపలో కొంత భాగం క్రైస్తవులందరికి అందించబడుచుండగా దేవుడు మన పాపములన్నిటిని క్షమించి వాటిని తుడిచివేస్తాడు. మనం తప్పకుండా 100% క్షమించబడ్డాము.

“మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.” 1 యోహాను 1:9

అయితే, పాపం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదమే ఉంటుంది. దేవుడు మనలను క్షమించి శుద్ధి చేస్తుండగా, మన పాపం వలన వచ్చే నాశనకరమైన ప్రతిఫలాన్ని దేవుడు తొలగించకపోవచ్చు. మన సొంత నిర్ణయాలను బట్టే కొనితెచ్చుకున్న కష్టసమయాల్లో దేవుడు మనకు సహాయం చేసినప్పటికీ, మనం అసలు అటువంటి నిర్ణయాలు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది.

శోధన మరియు పాపము పట్ల మనం ప్రభావంతంగా స్పందించుటలో ప్రాముఖ్యమైన రెండు విషయాలను 1 కొరింథీ వివరిస్తుంది.

“సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.” 1 కొరింథీయులకు 10:13

మొదటిగా, మనం మన పోరాటంలో ఒంటరిగా లేము. ఇతర క్రైస్తవులు కూడా ఉన్నారని మీరు తెలుసుకోవచ్చు. వారు దేవునితో నడిచిన అనుభవం 30 రోజుల లేదా 30 సంవత్సరాలు కావచ్చు నీవలే వారు కూడా శోధన మరియు పాపం విషయంలో కష్టపడుతూనే ఉంటారు.

రెండవదిగా, దీనిలో కూడా పాపమును తప్పించుకొనటానికి తగిన స్థితికి మించి మనలను దేవుడు శోధింపబడనీయడు. మనం తప్పించుకొనటానికి ఆయన ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని తెరిచి ఉంచుతాడు. అది ఎంత సవాలుతో కూడినది అయినప్పటికీ, శోధన మధ్యలో ఆ మార్గమును కనుగొనటమే మన పని.

ఈ క్రింది భాగం పాపం మరియు శోధనను ప్రభావవంతంగా జయించే విధానం గూర్చి మాట్లాడుతుంది. ఈ ప్రణాళికను కార్యసాధకం చేయడం దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చే విధానాల్లో ఒకటి!

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

దేవునికి మొదటి స్థానం ఇవ్వండి

మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అనేది ఏదో ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదు... ఇది ప్రతి క్రైస్తవునికి జీవిత కాలపు ప్రక్రియ. మీరు విశ్వాసములో క్రొత్తవారైనా, లేదా క్రీస్తును అనేక సంవత్సరాలుగా వెంబడిస్తున్నవారైనా, అర్థం చేసుకొని అవలంబించటానికి ఈ ప్రణాళిక మీకు సులభంగా ఉంటుంది. మరియు ఇది విజయవంతమైన క్రైస్తవ జీవితాలు జీవించటానికి అత్యంత ప్రభావవంతమైన ప్రణాళికగా ఉంటుంది. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సేకరించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te