దేవునికి మొదటి స్థానం ఇవ్వండినమూనా
“మీ హృదయంలో దేవుడు మొదటి స్థానం కోరుకుంటున్నాడు”
నేటి సమాజంలో, అనేకమంది తమ విలువను సంపదపై, తమ కంపెనీల్లో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో, వారి వ్యాపారం ఎంత విజయవంతంగా ఉందో, లేదా కేవలం వారి పరిచయాలు ఎటువంటివో అనేవాటిపై ఆధారితం చేసుకుంటారు.
అయితే, మన ప్రాముఖ్యత గూర్చిన దృక్కోణం ఇటువంటి వాటిపై ఆధారం చేసుకుంటే, ఈ విషయాల్లో మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు మాత్రమే మన గురించి మనం సంతోషంగా ఉంటాము. మన సంపద మరియు విజయం తరిగిపోతున్నప్పుడు, అది బలమైన పునాదిపై కట్టబడలేదు కనుక మన స్వీయ విలువ కూడా తరిగిపోతుంది. యేసు ఈవిధంగా దీనిని వివరిస్తున్నాడు:
“అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టినవానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను.” లూకా 6:49
మన గుర్తింపు మనం దానిని ఎంత బలమైన పునాదిపై కట్టుకున్నామో కేవలం అంత గట్టిగా మాత్రమే ఉంటుంది. మన గుర్తింపును బలమైన బండయైన యేసు మీద కట్టుకున్నప్పుడు, మన ఆనందం మార్పు చెందే ఆశాశ్వతమైన పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు.
క్రీస్తు మన పునాదిగా ఉన్నప్పుడు మన స్థిరత్వం ఈవిధంగా ఉంటుంది:
“వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను.” లూకా 6:48
మీరు మీ జీవితంలో ప్రాముఖ్యత యొక్క పునాదిని నిర్మించుకొనేటప్పుడు ఎన్ని రకాల ఎంపికలు చేసుకోవలసివస్తుందో ఒక్క క్షణం ఆలోచించండి. వాటిలో సంపద, ఉద్యోగం, మీరు కనిపించే విధానం, కుటుంబం, పేరుప్రఖ్యాతులు లేదా మీ పరిచయస్తులు ఉండవచ్చు. మీకు ఇంకా ఏమైనా గుర్తుకు వస్తున్నాయా? మన గుర్తింపును స్థిరపరచుకోవాలనుకునే అన్ని విషయాలకంటే, కేవలం యేసు మాత్రమే విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనకు ఇస్తానని వాగ్దానం చేశాడు.
కానీ మీరు ఇతర ఎంపికలను పరిశీలిస్తే, ఏదీ చెడ్డది లేదా స్వభావికంగా దుష్టమైనది ఉండదు. వాస్తవానికి, అనేక రకాలుగా చూస్తే, దేవుడు మన జీవితాల్లో మనకిచ్చిన బాధ్యతల్లో అవి చాలా ప్రాముఖ్యమైన విషయాలైవుంటాయి. కానీ మత్తయి సువార్తలో యేసు మనం ఒక సమతుల్యతను కలిగి ఉండటానికి సహాయం చేస్తున్నాడు.
“అందువలన నేను మీతో చెప్పునదేమనగా–ఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా? ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా?” మత్తయి 6:25-26
ఈ సత్యాన్ని మన జీవితాల్లో నిశ్చయించుకున్నప్పుడు చింత, ఆందోళన నుండి విడుదల పొంది సమాధానం మరియు సంతృప్తి పొందుతాము. యేసును మన జీవితాల్లో అన్ని విషయాల్లో మొదటి స్థానంలో ఉంచినప్పుడు ఈ సమతుల్యత సాధించగలుగుతాము.
“కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” మత్తయి 6:33
దేవుడు మనలను సృజించిన విధానమును బట్టి మనందరికీ కలలు, లక్ష్యాలు మరియు కోరికలు ఉంటాయి. కానీ యేసుకు మీదటి స్థానం యిచ్చుట అనేది మనం ఎటువంటి కలలు మరియు కోరికలు కలిగి ఉన్నాము మరియు వాటిని ఏ ఉద్దేశ్యము చేత సాధించాలని అనుకుంటున్నామో పరిశీలించుకొనటానికి మనలను నడిపిస్తుంది. ఆయన మీ కలలు మరియు కోరికల్లో మొదటి స్థానం కలిగి ఉన్నప్పుడు, మీ భవిష్యత్తు ఘనత మరియు ఆనందంతో నిండి ఉంటుంది!
మీ ఉద్దేశాల్లో ఏదైనా ప్రశ్నించదగింది ఏదైనా దేవుడు మీ దృష్టికి తెస్తే, మొట్టమొదటిగా మీరు మీ పద్ధతిని మార్చుకొనుటకు యిష్టత చూపేవారుగా ఉండాలి. కొన్నిసార్లు మార్చుకొనటం కష్టంగా ఉండవచ్చు కానీ దేవుడు మన పట్ల మంచి ప్రణాళికలు కలిగి మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశిస్తున్నాడు.
ఈ ప్రణాళిక గురించి
మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అనేది ఏదో ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదు... ఇది ప్రతి క్రైస్తవునికి జీవిత కాలపు ప్రక్రియ. మీరు విశ్వాసములో క్రొత్తవారైనా, లేదా క్రీస్తును అనేక సంవత్సరాలుగా వెంబడిస్తున్నవారైనా, అర్థం చేసుకొని అవలంబించటానికి ఈ ప్రణాళిక మీకు సులభంగా ఉంటుంది. మరియు ఇది విజయవంతమైన క్రైస్తవ జీవితాలు జీవించటానికి అత్యంత ప్రభావవంతమైన ప్రణాళికగా ఉంటుంది. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సేకరించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te