దేవునికి మొదటి స్థానం ఇవ్వండినమూనా

దేవునికి మొదటి స్థానం ఇవ్వండి

5 యొక్క 1

“దేవుని స్థలం, నా బహుమానం!”

మొదటి స్థానం – పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచే గురి. వ్యక్తిగతమైన లేదా బృంద పోటీల్లో, అత్యుత్తమ స్కోర్ లేదా సమయం గెలుపునిస్తుంది, ఆ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నవారికి మొట్టమొదటి స్థానం మొదటి బహుమతిని సంపాదించిపెడుతుంది. అయితే అదంతా ఒక ప్రాముఖ్యమైన విషయంలో తప్ప.

మనం రక్షణ పొందక మునుపు, మన జీవితాల్లో మనదే మొదటి స్థానం- మనం మన సొంత స్వార్థపూరిత అశలు తీర్చుకుంటూ, మన సొంత ఆలోచనలు నెరవేర్చుకుంటూ మన కోసమే బ్రతికేవారము. కానీ మనం క్రైస్తవులుగా మారిన తర్వాత, మొదటి స్థానం ఇకపై మనది కాదు; అది దేవునికి చెందినది.

దేవునికి మన జీవితాల్లో మొదటి స్థానం ఇవ్వటం మనం రక్షణ పొందిన దినముతో ప్రారంభమవుతుంది, కానీ మన జీవితాల్లోని అన్ని విషయాల్లో ఆయనను ప్రథమునిగా ఉంచుకోవడం అనేది కొనసాగుతూ ఉండే ప్రక్రియ. మనం అలా చేసినప్పుడు, ఈ భూమ్మీద నమ్మకమైన మరియు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తాము, నిత్యము దేవునితో నిత్య జీవంలో ఉండే చెప్పశక్యము కాని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాము.

“మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.” 1 కొరింథీయులకు 9:25

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

దేవునికి మొదటి స్థానం ఇవ్వండి

మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అనేది ఏదో ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదు... ఇది ప్రతి క్రైస్తవునికి జీవిత కాలపు ప్రక్రియ. మీరు విశ్వాసములో క్రొత్తవారైనా, లేదా క్రీస్తును అనేక సంవత్సరాలుగా వెంబడిస్తున్నవారైనా, అర్థం చేసుకొని అవలంబించటానికి ఈ ప్రణాళిక మీకు సులభంగా ఉంటుంది. మరియు ఇది విజయవంతమైన క్రైస్తవ జీవితాలు జీవించటానికి అత్యంత ప్రభావవంతమైన ప్రణాళికగా ఉంటుంది. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సేకరించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te