పునరుద్ధరణను ఎంచుకోవడంనమూనా
యేసు వాగ్దానం చేసిన సమృద్ధియైన జీవితం జీవించడానికి - పునరుద్ధరణను మనం ఎందుకు హృదయపూర్వకంగా కోరుకోవాలి
యోహాను10వ అధ్యాయంలో యేసు తనను తాను'మంచి కాపరి'అని పిలుచుకున్నాడు మరియు తన గొర్రెలమైన మన కోసం తన ప్రాణమును పెడతాను అని చెప్పాడు. తన గొఱ్ఱెలు తన స్వరాన్ని విని మరియు ఆయనను వెంబడిస్తాయి అని కూడా చెప్పాడు. ఆయన తనకు మరియు దొంగకు మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. దొంగ,మనకు బాగా తెలిసిన విధముగా,దొంగిలించడానికి,చంపడానికి మరియు నాశనం చేయడానికి మాత్రమే వస్తాడు,అయితే క్రీస్తు సమృద్ధియైన జీవాన్ని తీసుకురావడానికి వచ్చాడు.
శత్రువు అన్ని విధాలుగా పునరుద్ధరణను నిరోధించడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే ఒక పునరుద్ధరించబడిన క్రైస్తవుడు ఒక విప్లవాత్మకంగా ఉంటాడు!
మీ మానసిక ఆరోగ్యం ముఖ్యం కాదు అని వాడు మిమ్ములను ఒప్పిస్తాడు. వాడు మిమ్ములను నిర్లిప్తంగా ఉండడానికి ప్రోత్సహిస్తాడు మరియు మీ సమస్యలు పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఇతర మనుష్యుల యొక్క సమస్యలు మీ కంటే పెద్దవి అని నమ్మేలా చేస్తాడు. మీరు శాశ్వత ఆనందాన్ని కోల్పోయేలా స్వల్పకాలిక ఆనందంతో వాడు మిమ్ములను కళ్ళకు గుడ్డితనాన్ని కలిగిస్తాడు.
ఒక సమృద్ధియైన జీవం అంటే మన ఆత్మ వర్ధిల్లుతుంది అని అర్థం. - అన్ని చుక్కలు ఒక్క చోట చేరి,అన్ని బాధలు పోయాయి లేదా వదులుగా ఉన్న అంచులు కట్టివేయబడ్డాయి అని కాదు. బదులుగా,అది మన అంతరంగ పురుషుడు దేవుని ఆత్మ చేత పునరుజ్జీవింపబడిన జీవితం మరియు పునరుద్ధరించబడిన జీవితం.తద్వారా మనం ఎదుర్కొనే ప్రతిదానిని మనం నిర్వహించగలము - అది మరణం యొక్క లోయ అయినా లేదా మన మీద శత్రువు యొక్క పూర్తి దాడి అయినా దానిని మనం నిర్వహించాగాలుగుతాము.
ఇది మీ ఇష్టం.
మీకు సమృద్ధియైన జీవం కావాలంటే,అంతరంగంలోమిమ్ములను పునరుద్ధరించడానికి మీరు దేవునికి అవకాశాన్ని ఇవ్వాలి. శత్రువు మీ సమృద్ధిని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు,మీ ఆనందాన్ని చంపి,మీ సమాధానమును నాశనం చేస్తాడు,అయితే యేసు,మంచి కాపరి అన్నింటినీ పునరుద్ధరించడానికి ఆయన చేయగల ప్రతీదానిని చేస్తాడు మరియు దానిని ఎక్కువగా చేస్తాడు.
దీనిని ఆలోచించండి:
మీకు చెందిన సమృద్ధి జీవితాన్ని మీరు గడుపుచున్నారా?మిమ్ములను వెనకకు పట్టి ఉంచేది ఏమిటని మీరు అనుకుంటున్నారు?
దాని కోసం ప్రార్థించండి:
క్రీస్తులో మీరు ఒక సమృద్ధియైన జీవము కలిగి ఉంటారు అని నమ్మండి మరియు ప్రార్థించండి. శత్రువు మీ నుండి దొంగిలించిన సంవత్సరాలను పునరుద్ధరించమని దేవుణ్ణి అడగండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
దేవుని యొక్క ఆత్మ మన అనుదిన పునరుద్ధరణ మరియు పరివర్తనలో చురుకుగా పాల్గొంటాడు మరియు తద్వారా మనం యేసు వలె మరింతగా ఉద్భవిస్తాము. పునరుద్ధరణ అనేది ఈ నూతనపరచు పనిలో ఒక భాగం మరియు క్రైస్తవుని జీవితం యొక్క అత్యవసరమైన భాగం. అది లేకుండా, మనము పాత నమూనాలు, వైఖరులు, అలవాట్లు మరియు ప్రవర్తనల నుండి విముక్తి పొందలేము. జీవితకాల పునరుద్ధరణ యొక్క ప్రయాణంలో మొదటి అడుగులు వేయడానికి ఈ బైబిలు ప్రణాళిక మీకు సహాయం చేస్తుంది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaran కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/