పునరుద్ధరణను ఎంచుకోవడంనమూనా

పునరుద్ధరణను ఎంచుకోవడం

5 యొక్క 3

పునరుద్ధరణ అనేది దేవుని యొక్క చర్య - అయినప్పటికీ మనం అందులో చురుకుగా పాల్గొనాలి.

మన స్వంత జీవితాలలో పునరుద్ధరణ యొక్క పనిని మనం ప్రారంభించాలని మరియు నిర్వహించాలని అనేక సార్లు మనం అనుకుంటాము. ప్రపంచం అందించే స్వీయ-సంరక్షణ మరియు స్వస్థత కోసం అన్ని రకాల నివారణలు మరియు పద్ధతులు ఉన్నాయి,విచారకరంగా అవిఎక్కువ కాలం ఉండవు. దేవుడు పునరుద్ధరిస్తాడు మరియు ఆయన చేసినప్పుడు అది మన జీవితాలను లెక్కలేనన్ని మార్గాలలో మంచిగా మారుస్తుంది. అయితే దేవుడు మనలను పునరుద్ధరించడానికి,మనం మన వంతును నమ్మకంగా చెయ్యవలసి ఉంది.

ఈ క్రింది మూడు విషయాలను మనం చేయవలసి ఉంటుంది:

1.యేసు మన కాపరి అని గుర్తించండి

గొర్రెల కాపరికి తన గొఱ్ఱెలకు ఏ గడ్డి మంచిదో తెలిసిన విధముగా,యేసు మనలను గొప్ప శ్రద్ధతో మరియు కనికరంతో నడిపిస్తున్నాడు. గొర్రెల కాపరి తన నమ్మకమైన దండము మరియు దుడ్డుకర్రతో తన గొర్రెలను క్రూర జంతువుల నుండి రక్షిస్తాడు. సాతాను మరియు అతని శక్తులచే మనం దాడి చేయబడినప్పుడు యేసు మన నిశ్చలమైన సంరక్షకుడు. మన వ్యక్తిగత అవసరాల ఆధారంగా మనకు నిజంగా ఆహారం మరి ఎవ్వరూ ఇవ్వలేరు,ప్రతి భూభాగంలో మనకు మార్గనిర్దేశం చేయలేరు మరియు ప్రమాదం నుండి మనలను రక్షించలేరు. యేసు నిజంగా మంచి కాపరి.

2.తండ్రి యొక్క ప్రేమలో విశ్రాంతి పొందండి

కీర్తన23వ వచనం యొక్క ఒక అనువాదం2వ వచనంలో“ఆయన తన విలాసవంతమైన ప్రేమలో నాకు విశ్రాంతి స్థలాన్ని అందిస్తాడు”అని చెపుతుంది.

మన మీద దేవుని ప్రేమలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే జీవితం కొన్నిసార్లు మీ తెరచాపల నుండి గాలిని తీసివేస్తుంది లేదా మిమ్ములను నేల మీద పడవేస్తుంది. మీ కోసం ఒక మంచి దేవుని ప్రేమ యొక్క స్థిరమైన జ్ఞాపిక కాని యెడల,మీరు నిరాశలో లేదా ఆశాభంగములో మునిగిపోవచ్చు.

3.పరిశుద్ధాత్మ యొక్క నిరంతర అభిషేకాన్ని అనుభవించండి

5వ వచనం యొక్క ఒక అనువాదం చెపుతుంది “నా శత్రువులు పోరాడటానికి ధైర్యం చేసినా నీవు నా రుచికరమైన విందు అవుతావు. నీ పరిశుద్ధాత్మ సువాసనతో నన్ను అభిషేకిస్తున్నావు;నా గిన్నె పొంగిపోయే వరకు నేను త్రాగగలిగినది అంతా నీవు నాకు ఇస్తావు.”

పరిశుద్ధాత్మ యొక్క నింపుదల లేకుండా మనం వ్యక్తిగత పునరుద్ధరణను అనుభవించలేము. నీకు స్వస్థత అవసరమని నీకు తెలిసిన దానికంటే లోతైన మార్గాలలో ఆయన నీకు సహాయం చేస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు యొక్క పరిమళాన్ని వెదజల్లేలా చేస్తాడు మరియు మీరు ఇక మీదట ఓటమి,ఉద్దేశరహితం,తిరస్కరణ లేదా చేదు వాసనను మోసుకువెళ్ళరు!

దీనిని ఆలోచించండి:

మీ రక్షణ,మార్గదర్శకత్వం మరియు జీవనోపాధి కోసం మీరు ఎవరి వైపు చూసారు?వారు మీ అవసరాలన్నీ తీర్చగలిగారా?

దాని కోసం ప్రార్థించండి:

మీ మంచి కాపరిగా ఉండమని ప్రభువైన యేసును అడగండి,మీ యెడల తండ్రి యొక్క ప్రేమలో విశ్రాంతి తీసుకోవడానికి మిమ్ములను మీరు అనుమతించండి మరియు మిమ్ములను నూతనంగా అభిషేకించడానికి పరిశుద్ధాత్మను ఆహ్వానించండి.

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

పునరుద్ధరణను ఎంచుకోవడం

దేవుని యొక్క ఆత్మ మన అనుదిన పునరుద్ధరణ మరియు పరివర్తనలో చురుకుగా పాల్గొంటాడు మరియు తద్వారా మనం యేసు వలె మరింతగా ఉద్భవిస్తాము. పునరుద్ధరణ అనేది ఈ నూతనపరచు పనిలో ఒక భాగం మరియు క్రైస్తవుని జీవితం యొక్క అత్యవసరమైన భాగం. అది లేకుండా, మనము పాత నమూనాలు, వైఖరులు, అలవాట్లు మరియు ప్రవర్తనల నుండి విముక్తి పొందలేము. జీవితకాల పునరుద్ధరణ యొక్క ప్రయాణంలో మొదటి అడుగులు వేయడానికి ఈ బైబిలు ప్రణాళిక మీకు సహాయం చేస్తుంది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaran కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/