పునరుద్ధరణను ఎంచుకోవడంనమూనా

పునరుద్ధరణను ఎంచుకోవడం

5 యొక్క 1

పునరుద్ధరణ సాధారణంగా అంతరాయం యొక్క మూలం నుండి వస్తుంది

దావీదు బత్షెబాతో పాపం చేసిన తరువాత51వ కీర్తన వ్రాసాడు. అతని చర్యలు తీవ్రమైన పరిణామాలకు దారితీసాయి. ఈ పరిణామాలలో ఒకటి ఆ పాపం నుండి గర్భం దాల్చిన అతని పసికందు కుమారుని యొక్క మరణం. ఈ కీర్తన దేవునికి పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థనను వివరిస్తుంది,అతడు తన మార్గంలో కోల్పోయిన రక్షణ యొక్క ఆనందాన్ని పునరుద్ధరించమని కోరాడు. అతడు దేవునితో తన సంబంధాన్ని కోల్పోనప్పటికీ,అతడు ఆనందాన్ని కోల్పోయాడని తెలుసుకోవటానికి అతనికి తగినంతగా తెలుసు,ఇది ఆ సంబంధం యొక్క స్థిరమైన ఫలితం.

దేవుడు నమ్మకమైనవాడు మరియు అతనిని క్షమించి మరియు వారి సంబంధాన్ని పునరుద్ధరించాడు. దానికి రుజువు సొలొమోను జననంలో ఉంది,అతడు "దేవుని చేత ప్రేమించబడ్డాడు" కాబట్టి యదీద్యా అని పిలువబడ్డాడు.

మన దేవుడు పునరుద్ధరణ యొక్క పనిలో ఉన్నాడు. ఇది మనం తయారు చేయగలిగేది లేదా కల్పించి చేయగలిగేది కాదు,అయితే ఇది మనం చురుకుగా పాల్గొనే మరియు చోటు కల్పించే విషయం. మీరు తెలివితక్కువగా తీసుకున్న ఒక పక్కదారి కారణంగా మీ జీవితం శిథిలావస్థలో ఉన్నట్లు అనిపించవచ్చు. బహుశా మీ తప్పు లేకుండా మీరు ఒక శిధిలాలలో మిమ్ములను కనుగొంటారు. విషయాలు చాలా కాలం క్రితం జరిగి ఉండవచ్చు అయితే అవి ఇంకను మీకు బాధను మరియు హానిని కలిగిస్తాయి.

యేసు2000సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నప్పుడు కలుసుకున్న మనుష్యుల యెడల శ్రద్ధ చూపిన విధముగా మీ యెడల శ్రద్ధ వహిస్తాడు. ఆయన మనుష్యులను కేవలం శారీరక అనారోగ్యాల నుండి మాత్రమే కాకుండా అయితే మానసిక రుగ్మతల నుండి మరియు ఆత్మీయ మరణం నుండి స్వస్థపరిచాడు. ఆయన వారి జీవితంలో కనిపించే భాగాలను మాత్రమే కాకుండా పూర్తి వ్యక్తి కోసం శ్రద్ధ వహించాడు. వారి హృదయాలను చూడాలని ఆయన వారిని కోరారు,ఎందుకంటే దాని నుండి జీవపు ప్రవాహాలు ప్రవహిస్తాయి. తమ పూర్ణ హృదయంతో,ఆత్మతో,మనస్సుతో మరియు శక్తితో తనను ప్రేమించమని వారిని కోరాడు. ఇది అంతకన్నా మించిన ఆరోగ్యాన్ని పొందలేకపోయింది.

దీనిని ఆలోచించండి:

మీ స్వస్థ బుద్ధితో మీరు దేవుణ్ణి విశ్వసిస్తారా?

దాని కోసం ప్రార్థించండి:

ప్రతిరోజూ మిమ్ములను కొంచం కొంచం పూర్తిగా పునరుద్ధరించమని మీరు ఆయనను అడుగుతారా?

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

పునరుద్ధరణను ఎంచుకోవడం

దేవుని యొక్క ఆత్మ మన అనుదిన పునరుద్ధరణ మరియు పరివర్తనలో చురుకుగా పాల్గొంటాడు మరియు తద్వారా మనం యేసు వలె మరింతగా ఉద్భవిస్తాము. పునరుద్ధరణ అనేది ఈ నూతనపరచు పనిలో ఒక భాగం మరియు క్రైస్తవుని జీవితం యొక్క అత్యవసరమైన భాగం. అది లేకుండా, మనము పాత నమూనాలు, వైఖరులు, అలవాట్లు మరియు ప్రవర్తనల నుండి విముక్తి పొందలేము. జీవితకాల పునరుద్ధరణ యొక్క ప్రయాణంలో మొదటి అడుగులు వేయడానికి ఈ బైబిలు ప్రణాళిక మీకు సహాయం చేస్తుంది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaran కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/