పునరుద్ధరణను ఎంచుకోవడంనమూనా

పునరుద్ధరణను ఎంచుకోవడం

5 యొక్క 4

పునరుద్ధరించడానికి పునరుద్ధరించబడింది

పరిశుద్ధాత్మ నిన్ను పునరుద్ధరిస్తాడు తద్వారా నీవు ఇతరులను పునరుద్ధరించగలగుతావు!

కీర్తన51వ అధ్యాయం13వ వచనం,తాను దేవుని నుండి పొందిన సహాయంతో ఇతరులకు సహాయం చేయాలనే దావీదు కోరిక గురించి మాట్లాడుతుంది.

మన పునరుద్ధరణ ఎప్పుడూ మన గురించి కాదు. ఒక నిర్ణిత సమయంలో,ఇతరులను పునరుద్ధరించడంలో సహాయం చేయడానికి దేవుడు నిన్ను కదిలిస్తాడు. ప్రవక్తయైన యెషయా ఇశ్రాయేలు యొక్క మనుష్యులు చెరలో ఉన్నప్పటికీ,దేవుడు వారిని రక్షించి మరియు పునరుద్ధరిస్తాడు అని వారిని ప్రోత్సహిస్తున్నప్పుడు దీని గురించి రమ్యమైన రీతిలో వ్రాసాడు. అయినప్పటికీ ఇది అక్కడ ఆగదు,ఎందుకంటే ఆయన నగరాలను పునర్నిర్మించడానికి మరియు ఒక దేశాన్ని పునరుద్ధరించడానికి వారిని ఉపయోగిస్తాడు.

మన వ్యక్తిగత పునరుద్ధరణ అనేది జీవితకాల ప్రక్రియ అయితే,ఇతరులకు వారి పునరుద్ధరణను కనుగొనడంలో సహాయపడటం అనేది మనం తెలుసుకోవలసిన విషయం. మనుష్యులు ఆయనను కనుగొనడానికి మరియు ఆయన తీసుకువచ్చే స్వస్థత కోసం మన జీవితాలకు మనం ప్రవేశం ఇచ్చినప్పుడు దేవుడు దానిని ప్రేమిస్తాడు. ఆయన పునరుద్ధరణ శక్తిని ప్రసారం చేయడానికి ఆయనకు సిద్ధంగా మరియు అందుబాటులో ఉన్న వ్యక్తి అవసరం.

మీరు విద్యార్థి కావచ్చు,పని చేసే పని చేసే వృత్తినిపుణుడు లేదా గృహిణి కావచ్చు - ఇది పట్టింపు లేదు. మీరు అవసరములోఉన్నవారి యెడల దయను మరియు దాతృత్వమును కనుపరచినప్పుడు,మీరు పగిలిన గోడలను మరమ్మత్తు చేసేవారు మరియు నివాసాలతో వీధులను పునరుద్ధరించేవారు అవుతారు. మీరు సహాయం చేసే మనుష్యులు ఎప్పటికీ మార్చబడతారు మరియు అంతే కాదు,తరాలు ప్రభావితం చెందబడతాయి.

దేవుడు మన కోసం వ్యక్తిగతంగా కలిగి ఉన్న పిలుపును మనం జీవిస్తున్నప్పుడు మరియు మన నిర్దిష్ట సందర్భంలో గొప్ప ఆజ్ఞకు విధేయత చూపించినప్పుడు, దారి తప్పి తిరిగేఇతరులకు శాశ్వతమైన పునరుద్ధరణను తీసుకురావడం కనుగొంటాము.

దీనిని ఆలోచించండి:

మీరు మీ కథనాన్ని ఎవరితో పంచుకోవచ్చు మరియు ఎవరికీ వినే చెవిని లేదా సహాయము చేసే హస్తాన్ని అందించగలరు?

మీరు దేవుని మంచితనానికి ఒక జలాశయంగా కాకుండా పునరుద్ధరణ ప్రవాహముగా ఎలా మారగలరు?

ఒకరు స్వీకరిస్తారు అలాగే ఇస్తారు,మరొకరు మాత్రము నిల్వ చేస్తారు.

దాని కోసం ప్రార్థించండి:

మీ చుట్టూ ఉన్న అవసరాల పట్ల మీ కళ్ళు తెరవమని మరియు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి మీకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి.

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

పునరుద్ధరణను ఎంచుకోవడం

దేవుని యొక్క ఆత్మ మన అనుదిన పునరుద్ధరణ మరియు పరివర్తనలో చురుకుగా పాల్గొంటాడు మరియు తద్వారా మనం యేసు వలె మరింతగా ఉద్భవిస్తాము. పునరుద్ధరణ అనేది ఈ నూతనపరచు పనిలో ఒక భాగం మరియు క్రైస్తవుని జీవితం యొక్క అత్యవసరమైన భాగం. అది లేకుండా, మనము పాత నమూనాలు, వైఖరులు, అలవాట్లు మరియు ప్రవర్తనల నుండి విముక్తి పొందలేము. జీవితకాల పునరుద్ధరణ యొక్క ప్రయాణంలో మొదటి అడుగులు వేయడానికి ఈ బైబిలు ప్రణాళిక మీకు సహాయం చేస్తుంది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaran కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/