ప్రభువైన యేసు విధానంలో ప్రార్థించుట నేర్చుకోవడంనమూనా
ప్రవచనాత్మక ప్రార్థన నేర్చుకోవడం
ప్రార్థనలు ప్రవచనాత్మక ప్రకటనలు. అవి ఆ విధంగా ఉండాలి. దురదృష్టవశాత్తు, చాలా తరచుగా మన ప్రార్థనలు సహనంలేనివిగా ఉంటాయి, స్వీయ జాలితో నిండి ఉంటాయి. మనం ప్రార్థనలో నిందలు మోపుతుంటాము, సణుగుతుంటాము, వ్యర్ధ సంభాషణలు చేస్తాము. మనం వీటన్నిటినీ కచ్చితంగా చేస్తున్నప్పటికీ, మనం కృపా సింహాసనం వద్దకు వచ్చిన కారణంగా మనం లేచి నిలువబడాలి, ధూళిని దులిపి వేయాలి, తప్పుగా జరుగుతున్న దానిని గురించి మాట్లాడడానికి బడులుగా దేవుడు మనకోసం నిల్వ ఉంచిన వాటిని గురించి మాట్లాడుదాం.
ప్రవచనం అంటే జోస్యం చెప్పడం లాంటిది కాదు. అయితే రాబోయే వాటిని చెప్పడం అంటే మన మీదా, మన పరిస్థితులమీదా దేవుడు నిశ్చయించిన దానిని మాట్లాడడానికి మనం లేఖనాలను ఉపయోగిస్తాము. ప్రవచనం అంటే విశ్వాసపు చూపును వినియోగించడం, ఇది అదృశ్యమైన వాటిని చూడగల్గుతుంది, ప్రతి పరిస్థితి మీదనూ, ప్రతీ కలయిక మీదనూ దేవుని వాక్కును ప్రకటిస్తుంది.
దేవుని వాక్యం ప్రవచనాత్మకంగా ఉండడం కోసం, మన భావాల మీద ఆధారపడకుండా మన హృదయాలలో దాచబడి ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రార్థనలు చెయ్యబడతాయి. మనం లేఖనాలను చదవడం, నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు, మన దైనందిన పరిస్థితులలో దానిని ఎత్తిపట్టడం ప్రారంభించవచ్చు. ఈ ప్రార్థనలు ఆధ్యాత్మిక వాతావరణంలో మాట్లాడటం, విశ్వాస వాతావరణాన్ని సృష్టించడం చేస్తుండగా ఇవి శక్తివంతమైనవిగా ఉంటాయి.
ప్రవచనాత్మక ప్రార్థనలు మన జీవిత లిపిని సృష్టిస్తాయి ఎందుకంటే అవి దేవుని కోసం ఎదురుచూడడానికీ, ఆయన రాజ్యం భూమి మీద రావడం చూడడానికీ మనలను సిద్ధపరుస్తున్నాయి. అవి మన విశ్వాసాన్ని బలపరుస్తాయి, పరిశుద్ధాత్మ మన జీవితాలలో సహజాతీతంగా క్రియను జరిగించడానికీ, నమ్మశక్యం కాని పరివర్తనను తీసుకురావడానికీ వీలు కల్పిస్తాయి.
ఈ ప్రణాళిక గురించి
మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన తరచుగా నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. ఎందుకంటే దేవునికి ప్రతిదీ తెలుసు కాబట్టి, మనం ఆయనతో మాట్లాడవలసిన అవసరం లేదు అని మనం భావిస్తాము. అయితే ఈ ప్రణాళిక మీ జీవితాన్ని తిరిగి క్రమపరచడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా మీ జీవితం కోసం దేవుని చిత్తాన్ని ఉద్దేశపూర్వకంగా వెదకడానికి మీరు సమయం కేటాయిస్తారు. మీరు ప్రార్థించేవన్నీ జరగడం చూసే వరకూ ప్రార్థన చేస్తారు. ఇకమీదట ప్రార్థన మనకు ఒక ప్రత్యామ్నాయ ఎంపిక కాదు అయితే ప్రతిదాని విషయంలో ప్రార్థన మొదటి ప్రతిస్పందనగా ఉండాలి.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.wearezion.co/bible-plan