ప్రభువైన యేసు విధానంలో ప్రార్థించుట నేర్చుకోవడంనమూనా
కీలక ప్రార్థన నేర్చుకోవడం
సైన్సులో మనం ఆధార స్థానం అని పిలువబడే ఒక ఇరుసు ను గురించి మనం నేర్చుకున్నాం. దానిమీదా దేనినైనా ఉంచినప్పుడు అది సులభంగా ముందుకు కదులుతుంది. పైకీ కిందకు ఊగులాడే బల్లను గురించి గానీ లేదా కీలు మీద నిలిపిన తలుపును గురించి గానీ ఆలోచించండి. ఈ రోజువారీ వస్తువులు వాటి ఇరుసులను బట్టి సజావుగానూ, సులభంగానూ కదులుతాయి. ఒక ఇరుసు తక్కువ శక్తితో దిశ తిరగడాన్ని సృష్టిస్తుంది. కీలకమైన ప్రార్థన ఇదే పనిని చేస్తుంది.
ప్రార్థన అనేది ఆధ్యాత్మిక వాతావరణాన్ని మార్పు చేసి దేవుని చిత్తాన్ని గమనంలోనికి తీసుకొని వస్తుంది. ప్రార్థన అనేది దేవుణ్ణి ఆరాధించే ప్రార్థన, రాజ్యానికి ప్రయోజనం కలిగించే ప్రార్థన. శిష్యులు ప్రార్థన ఏవిధంగా చేయాలో నేర్పించాలని ప్రభువును అడిగినప్పుడు, ఇప్పుడు “పరలోక ప్రార్థన” అని ప్రముఖంగా తెలిసిన ప్రార్థనను ప్రభువు తన శిష్యులకు బోధించడం ద్వారా ఆయన స్పందించాడు. ఈ ప్రార్థన చిన్నదిగానూ, మధురంగానూ ఉంది. అయినప్పటికీ ఇది అంతా ఆవరించి ఉంది. కీలకమైన (ఇరుసు) ప్రార్థన ఈ విధంగా కనిపిస్తుంది. కీలకంగా ప్రార్థించడం అంటే "ఉన్నత స్థాయిలలో ప్రార్థన నేర్చుకోవడం" అని టిమ్ ఎల్మోర్ నిర్వచించాడు. ఈ ప్రార్థనలు "పరిచర్య చేత ప్రేరేపించబడినవి, నిర్వహణ చేత ప్రేరేపించబడేవి కాదు” అని కూడా ఆయన చెప్పారు.
మనం ప్రభువు ప్రార్థనను విశ్లేషించినప్పుడు, ఒక కీలకమైన (ఇరుసు) ప్రార్థన దాగియున్నట్టు సహజమైన దృష్టితో చూస్తాము. తండ్రియైన దేవుణ్ణి సంబోధించడంతోనూ, ఆయన నామాన్ని ఘనపరచడంతోనూ ఈ ప్రార్థన ఆరంభం అవుతుంది. దేవుని రాజ్యం భూమి మీదకు రావాలనీ, ఆ దినానికి అవసరమైన ప్రతిదానినీ దయచేయాలనీ ప్రాధేయపడుతూ తరువాత ప్రార్ధిస్తున్న వానికి క్షమాపణ కోసం కోరడంతో కొనసాగుతుంది, అది అక్కడితో ఆగిపోదు, అయితే స్వీకరించబడిన క్షమాపణ కనుపరచబడిన క్షమాపణగా మార్పు చెందేలా చూడాలి. కీడు నుండి రక్షణ కోసం ఒక అభ్యర్థనతో ప్రార్థన ముగిస్తుంది.
ఇలాంటి ప్రార్థన మన నుండి దేవుని రాజ్యానికి మన సమీకరణాన్ని మారుస్తుంది. మనకోసం ప్రార్థించడం తప్పు కాదు-వాస్తవానికి మనం చేయాల్సిన అవసరం ఉంది. బదులుగా మనం శాశ్వత దృక్పథంతో మనకోసం ప్రార్థిస్తే ఏమి జరుగుతుంది? అనేకులు యేసు నామంలో రక్షణ పొందేలా ఆయన రాజ్యం మన జీవితాలను ఆక్రమించాలని దేవున్ని ప్రార్థించేవిగా మనం ప్రార్థనలు ఉన్నట్లయితే ఏవిధంగా ఉంటుంది?
ఇది మన జీవితాలను విప్లవాత్మకంగా చేస్తుంది, ఈ లోకంలో దేవుని కార్యం కోసం శక్తివంతమైన సాధనాలుగా చేస్తుంది.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన తరచుగా నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. ఎందుకంటే దేవునికి ప్రతిదీ తెలుసు కాబట్టి, మనం ఆయనతో మాట్లాడవలసిన అవసరం లేదు అని మనం భావిస్తాము. అయితే ఈ ప్రణాళిక మీ జీవితాన్ని తిరిగి క్రమపరచడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా మీ జీవితం కోసం దేవుని చిత్తాన్ని ఉద్దేశపూర్వకంగా వెదకడానికి మీరు సమయం కేటాయిస్తారు. మీరు ప్రార్థించేవన్నీ జరగడం చూసే వరకూ ప్రార్థన చేస్తారు. ఇకమీదట ప్రార్థన మనకు ఒక ప్రత్యామ్నాయ ఎంపిక కాదు అయితే ప్రతిదాని విషయంలో ప్రార్థన మొదటి ప్రతిస్పందనగా ఉండాలి.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.wearezion.co/bible-plan