ప్రభువైన యేసు విధానంలో ప్రార్థించుట నేర్చుకోవడంనమూనా
పట్టుదల ప్రార్థన నేర్చుకోవడం
పట్టుదలతో ప్రార్థన అంటే ప్రార్థన విషయంలో ఎప్పుడూ వదులుకోకుండా ఉండే వైఖరి. నీవు ఏదైనా ప్రతిష్టంభనలో ఉన్నట్లు మీకు అనిపించినప్పుడు లేదా ఏమీ మారడం లేదని అనిపించినప్పుడు ఇది మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. అవసరాల కోసం దేవుణ్ణి అడగడంలో కొన్నిసార్లు పునరావృతం అయినప్పటికీ ఇది మూర్ఖంగా ఉంటుంది. ఈ రకమైన ప్రార్థన యొక్క ఆధారం తన పిల్లలకు మంచి బహుమతులు ఇచ్చే పరిపూర్ణ పరలోకపు తండ్రిని కలిగి ఉండటమే
ప్రార్థన ప్రక్రియకు నిలకడ పట్టుదల ఉత్ప్రేరకం. మనకు కావలసినవి, మనం అడిగేవీ దేవునికి ముందుగా తెలుసు అనే అంశాన్ని ఆలోచన చేసినట్లయితే ప్రార్థనలో పట్టుదల అవసరమా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇప్పటికే తెలుసు. మనం ఎందుకు అడుగుతూ ఉండాలి? ప్రభువైన యేసు తన శిష్యులకు లూకా 11 అధ్యాయంలో ఈ విధంగా చెపుతున్నాడు. వారు కోరినది స్వీకరించడానికి అడగాలి, వెదకాలి, తట్టాలి. ఆసక్తికరంగా ఈ మూడు క్రియా పదాలకు వినియోగించిన హెబ్రీ పదాలు శత్రర్థకం రూపంలో (ప్రస్తుతం కొనసాగే) ఉన్నాయి, అంటే వాస్తవానికి “అడగడం కొనసాగించాలి, కోరడం కొనసాగించాలి, వెదకడం కొనసాగించాలి” అని అర్థం. ప్రార్థనలో పట్టుదల (నిలకడ) అనే భావనను వివరించడానికి ప్రభువైన యేసు రెండు ఉపమానాలను ఉపయోగించాడు. ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ అని సూచిస్తుంది.
ఈ రకమైన ప్రార్థనకు అడ్డంకి తక్షణ తృప్తి కోసమైన మన అవసరం కావచ్చును. అవును అని గానీ లేదా కాదు అని గానీ తక్షణ ప్రతిస్పందనలను మనం కోరుకుంటాము. ఆలస్యాలనూ, లేదా అస్పష్టతలనూ మనం ద్వేషిస్తాము. తక్షణ కాఫీ లేదా ఘనీభవించిన ఆహారపదార్దాల్లా అదే రోజున మనకు సమాధానాలు కావాలి.
అయితే వాస్తవికతను గురించి మనం ఆలోచించినట్లయితే కొన్ని ప్రార్థనలకు జవాబు రావడానికి నెలలు లేదా కొన్ని సంవత్సరాలు పడుతుంది.
పట్టుదల ప్రార్థనలు ఇతరులను గానీ లేదా మన పరిస్థితులను గానీ మార్చకపోవచ్చు, అయితే అవి మనల్ని మారుస్తాయి. అవి మన హృదయాలను, మన స్థితిని, మన మనస్తత్వాన్ని మారుస్తాయి, ప్రభువైన యేసులో మనం కనుగొనే నిరీక్షణను బలపరుస్తాయి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన తరచుగా నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. ఎందుకంటే దేవునికి ప్రతిదీ తెలుసు కాబట్టి, మనం ఆయనతో మాట్లాడవలసిన అవసరం లేదు అని మనం భావిస్తాము. అయితే ఈ ప్రణాళిక మీ జీవితాన్ని తిరిగి క్రమపరచడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా మీ జీవితం కోసం దేవుని చిత్తాన్ని ఉద్దేశపూర్వకంగా వెదకడానికి మీరు సమయం కేటాయిస్తారు. మీరు ప్రార్థించేవన్నీ జరగడం చూసే వరకూ ప్రార్థన చేస్తారు. ఇకమీదట ప్రార్థన మనకు ఒక ప్రత్యామ్నాయ ఎంపిక కాదు అయితే ప్రతిదాని విషయంలో ప్రార్థన మొదటి ప్రతిస్పందనగా ఉండాలి.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.wearezion.co/bible-plan