ప్రభువైన యేసు విధానంలో ప్రార్థించుట నేర్చుకోవడంనమూనా
మనం ఎందుకు ప్రార్థించాలి?
ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు శరీరంలో ఉన్న దేవుడు, ఆయనకే ప్రార్థన అవసరం అయ్యింది. ఆయన ప్రార్థన చెయ్యడానికి సమయం తీసుకొన్నాడు. మనుష్యులకు ఆహారాన్ని పంచి ఇచ్చినప్పుడూ, వారిని స్వస్థ పరచినప్పుడూ ఆయన ప్రార్థన చేసాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడూ, నిందించబడినప్పుడూ, మరణించడానికి విడువబడినప్పుడూ ప్రార్థన చేసాడు. భూమి మీద ప్రభువైన యేసు పరిచర్యకు ప్రార్థనే రహస్యం. ఆయన ప్రార్థననూ ఒక మాదిరిగా మాత్రమే చూపించలేదు అయితే ప్రార్థన చెయ్యడం ఆయన మనకు నేర్పించాడు.
ప్రార్థన ఒక కళారూపం కాదు, అయితే అది ఒక జీవన విధానం. ఇది ఒక సంభాషణ, దేవుణ్ణి తెలుసుకోవాలానే కోరికనూ, ఆయన నుండి వినాలనే గొప్ప కోరికలో పాదుకొని ఉంది. మనం ఇప్పటికే ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, ఏవిధంగా ప్రార్థన చేయాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. మన నేపథ్యం లేదా అనుభవం ఏవిధంగా ఉన్నప్పటికీ మన మన క్రైస్తవ జీవిత వస్త్రాలన్నిటిలో ప్రార్థన నేయబడి యుండాలి.
ప్రార్థన ఒక సంభాషణ అయినట్లయితే, ఇది కేవలం ఒక వైపునుండి ఉండే సంభాషణ కాదు అని తెలుసుకోవడం ప్రాముఖ్యం.
ఇది నీ సృష్టికర్తకూ నీకూ మధ్య సంభాషణ. ఇది సన్నిహితమైనది, వ్యక్తిగతమైనది, అంటే ప్రార్థనలో ఇరువైపుల వారు మాట్లాడటానికీ, వినడానికీ అవకాశం లభిస్తుంది. గ్రాహ్యము కాని గొప్ప సంగతులను దేవుడు మనకు చెప్పేలా మనం దేవునికి పార్థన చెయ్యాలని ప్రవక్తయైన యిర్మీయా మనలను కోరుతున్నాడు. అది గొప్ప ఘనత, ఆధిక్యత కాదా? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన రాజు మనలో నమ్మకం ఉంచాలనీ, మనతో మాట్లాడాలనీ కోరుకుంటున్నాడు.
దేని విషయాన్నైనా మనం దేవుణ్ణి అడగవచ్చు అని జ్ఞాపకం ఉంచుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. మనకు అడిగిన ప్రతీదానిని ఇచ్చేలా యాంత్రికంగా ఇది ఆయన వద్దకు చేరదు. ఎటువంటి మనవి యైనా ఆయన ముందుకు తీసుకొని రావడానికి అతి చిన్నది అని గానీ లేదా అతి పెద్దది అని గానీ కాదు. ప్రార్థనలన్నీ ప్రార్థించబడకుండా విడిచిపెట్టబడి ఉండడం అత్యంత విషాదకరమైన సంగతి అని ఒకరు ఒక సందర్భంలో చెప్పారు. “దేవి విషయంలోనైనా ఆయన నామంలో ప్రార్థన చెయ్యండి’ అని ప్రభువు తానే తన శిష్యులతో చెప్పాడు.
మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన నిత్యుడైన మన దేవునికి సువాసనతో కూడిన ధూపంలా ఉంటుంది. కనుక మీ ప్రార్థనలను తక్కువగా చూడకండి. మీ జీవితంలో అతి పెద్ద విషయం నుండి చిన్న విషయం వరకూ ప్రార్థించండి. ప్రతీ దినంలోని ప్రతీ క్షణంలో ప్రార్థన దేవుణ్ణి కలిగి ఉంటుంది.
ఈ ప్రణాళిక గురించి
మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన తరచుగా నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. ఎందుకంటే దేవునికి ప్రతిదీ తెలుసు కాబట్టి, మనం ఆయనతో మాట్లాడవలసిన అవసరం లేదు అని మనం భావిస్తాము. అయితే ఈ ప్రణాళిక మీ జీవితాన్ని తిరిగి క్రమపరచడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా మీ జీవితం కోసం దేవుని చిత్తాన్ని ఉద్దేశపూర్వకంగా వెదకడానికి మీరు సమయం కేటాయిస్తారు. మీరు ప్రార్థించేవన్నీ జరగడం చూసే వరకూ ప్రార్థన చేస్తారు. ఇకమీదట ప్రార్థన మనకు ఒక ప్రత్యామ్నాయ ఎంపిక కాదు అయితే ప్రతిదాని విషయంలో ప్రార్థన మొదటి ప్రతిస్పందనగా ఉండాలి.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.wearezion.co/bible-plan