దేవుడు చేసిన అన్నిటిని జ్ఞాపకము చేసికొనుటనమూనా
మీరు క్రీస్తును మీ వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించినట్లయితే, అప్పుడు మీరు ఒక నూతన సృష్టి. "పాతవి గతించెను మరియు ఇవిగో క్రొత్తవి!" గడచిన వారంలో మీరు దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క విశ్వాసమును, దేవుడు ఒక వ్యక్తిగా మీరు ఎదుగుటకు ఉపయోగించిన వాటిని గూర్చి, మరియు క్రీస్తు మన కొరకు చేసిన అంతిమ ప్రాణ అర్పణమును ఇవన్నియూ జ్ఞాపకము చేయేసికొనుటకు మీ యొక్క గతంలోకి చూసికొని యున్నారు. నేడు, దేవుని క్షమాపణ యొక్క విమోచనా శక్తిని గురించి 2 వ కొరింథీయులకు 5:11-21లో ఉన్న పదములను ధ్యానించుదాము. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇవ్వబడిన క్షమాపణను మించిన శక్తిమంతమైనది, విశ్వాసపాత్రమైనది, త్యాగపూరితమైనది, మరియు జీవితం యందు మార్పు ఏదియునూ లేదు. నేడు, దేవుని యొక్క క్షమాపణ ద్వారా మీరు అనుభవించిన జీవితం యందు మార్పును గుర్తుంచుకోవాలి. పూర్తిగా మీ పాత జీవితమును మరచిపోయి మరియు బదులుగా మీ జీవితం శాశ్వతంగా మార్చిన రోజును గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రము మరియు క్రీస్తులో నూతన జీవితం కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదాము.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
భవిష్యత్ వైపు చూడటం అనేది మన సహజమైన ధోరణి, అయితే గత చరిత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యక్తిగా ఈ రోజున మీరు ఉన్న ప్రస్తుత రూపంలోకి మిమ్మల్ని తీర్చిదిద్దుటకు దేవుడు చేసినదంతా గుర్తుచేసుకొనుటకు ఈ ప్రణాళికను మీ కోసం 5-రోజులకు రూపకల్పన చేయబడినది. ప్రతిరోజు, మీరు బైబిలు పఠనం మరియు క్రీస్తుతో మీ నడక యొక్క ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకొనుటకు సహాయపడునట్లు కూర్పు చేయబడిన దేవుని క్లుప్త వాక్య ధ్యానమును పొందుతారు. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి
More
We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church