దేవుడు చేసిన అన్నిటిని జ్ఞాపకము చేసికొనుటనమూనా

Remembering All God Has Done

5 యొక్క 4

ప్రభువు రాత్రి భోజనము అనే చర్య జ్ఞాపకార్థ చర్య. 19 వ వచనంలో, యేసు ఇలా చెప్పాడు, "ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోనుటకు దీనిని చేయుడి." మనము ఎప్పుడైనా ప్రభువు రాత్రి భోజనములో పాలుపంచుకున్నప్పుడు మన పాపముల కొరకు శిలువపై మరణించడం ద్వారా క్రీస్తు చేసిన అంతిమ ప్రాణ అర్పణమును జ్ఞాపకం చేసుకుంటాము. క్రీస్తు యొక్క ప్రాణ అర్పణమును జ్ఞాపకం చేసుకొనుటకు ఈ రోజు మీ సమయమును వెచ్చించండి. ఎందుకంటే ఆయన యొక్క మరణం మరియు పునరుత్థానం వలన మీరు కొత్త జీవితాన్ని పొందగలిగారు, క్రీస్తు మన అందరి తరపున చేసిన అంతిమ ప్రాణ అర్పణమును ఎన్నటికీ మరచి పోవద్దు. ఇందు వలన మీ భవిష్యత్తు శాశ్వతంగా మార్చబడింది. మీకు వీలైతే నేడు ప్రభువు రాత్రి భోజనములో పాల్గొనండి. మీరు ప్రభువు రాత్రి భోజనములో పాలుపంచుకుంటప్పుడు, యేసు ఆజ్ఞాపించిన రీతిగా మీరు చేయుడి మరియు మీరు ఈ పవిత్ర దైవ కార్యములో పాలుపొందుతూ ఆయనను జ్ఞాపకం చేసుకొనుడి.

వాక్యము

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

Remembering All God Has Done

భవిష్యత్ వైపు చూడటం అనేది మన సహజమైన ధోరణి, అయితే గత చరిత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యక్తిగా ఈ రోజున మీరు ఉన్న ప్రస్తుత రూపంలోకి మిమ్మల్ని తీర్చిదిద్దుటకు దేవుడు చేసినదంతా గుర్తుచేసుకొనుటకు ఈ ప్రణాళికను మీ కోసం 5-రోజులకు రూపకల్పన చేయబడినది. ప్రతిరోజు, మీరు బైబిలు పఠనం మరియు క్రీస్తుతో మీ నడక యొక్క ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకొనుటకు సహాయపడునట్లు కూర్పు చేయబడిన దేవుని క్లుప్త వాక్య ధ్యానమును పొందుతారు. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి

More

We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church