ఈస్టర్ ఎందుకు?నమూనా
![Why Easter?](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F14896%2F1280x720.jpg&w=3840&q=75)
ఇప్పుడు మనము ఏం చేయాలి?
దేవుడు తాను అనుగ్రహించిన ఈ గొప్ప వరమును అంగీకరించాలంటే ఏదో చేయాలని క్రొత్త నిబంధన మనకు స్పష్టము చేస్తుంది. అదేమనగా, విశ్వాసముతోకూడిన క్రియ. 'దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను' (యోహాను 3:16) అని యోహాను వ్రాసెను.
యేసును గూర్చి మనకు తెలిసినదానిని బట్టి ఉండే మన నమ్మిక, విశ్వాసముతో ముడిపడియుండును. ఇదేదో మూఢనమ్మకం వంటిది కాదు. ఇది ఒక వ్యక్తి యందు మనముంచే నమ్మిక. తమ వివాహా దినమున, ఒక వధువు లేక వరుడు 'జీవితాతంతము ఏమైననూ కలిసి జీవించుటకు చేసుకొనే వివాహా వాగ్దానముల'ను పలుకుతున్నప్పుడు తాము వేసే విశ్వాసపు అడుగువలె ఉండును.
ప్రజలు తీసుకొను ఈ విశ్వాసపు క్రియ పలు విధాలుగా ఉండునప్పటికి, నేను మీకు దీనిని ఎలా తీసుకోవలెనో ఇప్పుడే తెలియజేస్తాను. దీనిని మూడు సులువైన మాటల ద్వారా కుదించవచ్చును:
'క్షమించు'
నీవు చేసిన తప్పులన్నిటిని బట్టి దేవునిని నీవు క్షమించమని అడగాలి మరియు నీ జీవితములో ఏవి తప్పులని నీకు తెలియునో వాటన్నిటిని విడిచి పెట్టి వాటినుండి వైదొలగాలి. దీనినే బైబిల్ నందు 'పశ్చాత్తాపము' అని అంటారు..
'కృతజ్ఞతలు'
యేసు మన కొరకు సిలువపై మరణమొందెను అని మనం విశ్వసిస్తున్నాము. నీ కొరకు ఆయన చనిపోయినందుకు, నీకు తాను అనుగ్రహించిన ఉచిత బహుమానమైన క్షమాపణ, విడుదల కొరకు మరియు తాను అనుగ్రహించు ఆత్మ కొరకు నీవు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలయును.
'దయచేసి'
మన జీవితములలో తన మార్గములో నడుచుటకు దేవుడెంత మాత్రము నిన్ను బలవంతపెట్టడు. ఆయన బహుమానమును నీవు అంగీకరించి, ఆయనను నీలోనికి వచ్చుటకు మరియు తన ఆత్మ ద్వారా నీలో నివసించుటకు ఆయనను ఆహ్వానించుము.
దేవునితో ఒక సంబంధమును కలిగియుండాలని నీవు ఆశించినట్లయితే మరియు ఈ మూడు విషయాలను పలుకటకు నీవు సిద్ధముగా ఉన్నట్లయితే, ఆ సంబంధమును మొదలుపెట్టుటకు నీవు ప్రార్థించతగిన అతి సులువైన చిన్న ప్రార్థన ఇదిగో.
యేసు క్రీస్తు ప్రభువా,
నా జీవితములో నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నన్ను క్షమించమని కోరుకుంటున్నాను(నీ మనస్సులో నీవు దేనిని బట్టి అయినా ప్రత్యేకముగా క్షమాపణ కోరాలని నీకు అనిపించే విషయముల కొరకు కొద్ది క్షణములు కేటాయించుము).దయచేసి నన్ను క్షమించు. ఇక మీదట నాకు తెలిసిన తప్పులన్నిటిని విడిచిపెట్టి వాటినుండి నేను ప్రక్కకు వైదొలుగుతున్నాను.
నేను క్షమించబడుటకు మరియు వాటి నుండి విడుదల పొందుటకు నీవు నా కొరకు సిలువపై మరణమొందినందుకు నీకు వందనములు.
నీ యొక్క క్షమాపణను మరియు ఆత్మ అను వరమునకు కృతఙ్ఞతలు. నీవు అనుగ్రహించిన ఈ బహుమానమును నేను ఇప్పుడు పొందుకుంటున్నాను.
పరిశుద్ధాత్మ ద్వారా నా జీవితములోనికి వచ్చి నిత్యము నాతో నివసించుటకు దయచేసి రమ్మని కోరుతున్నాను.
యేసు ప్రభువా మీకు వందనములు. ఆమెన్
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
![Why Easter?](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F14896%2F1280x720.jpg&w=3840&q=75)
ఈస్టర్ ప్రాముఖ్యత ఏమిటి? 2,000 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తిపై ఎందుకు అంత ఆసక్తి నెలకొనింది? అనేకులు యేసును గురించి ఉత్తేజితులవుటకు కారణమేమిటి? ఆయన మనకెందుకు అవసరము? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఇవన్నీ తెలుసుకొనుటకు ఆరాటపడవలసిన అవసరమేమిటి? ఈ 5 రోజుల ప్రణాళికలో, నిక్కీ గుంబెల్ ఆ ప్రశ్నలకు ఆలోచింపచేసే సమాధానాలను పంచుకుంటాడు.
More