ఈస్టర్ ఎందుకు?నమూనా

Why Easter?

5 యొక్క 4

వేటి కొరకు స్వాతంత్రము?

భౌతికంగా యేసు ఈ భూమి మీద లేనప్పటికి, ఆయన మనలను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టలేదు. మనతో నుండుటకు ఆయన తన పరిశుద్ధాత్మను పంపెను. ఆ పరిశుద్ధాత్మ మనలో నివసించుటకు వచ్చినప్పుడు, ఆయన మనకు ఒక నూతన స్వాతంత్రమును ఇచ్చును.

దేవుని తెలుసుకొనుటలో స్వాతంత్రము

మనము పాపము చేసినప్పుడు అది మనకు దేవునికి మధ్య ఒక అడ్డుబండగా మారును: 'మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను' (యెషయా 59:2). యేసు ఆ సిలువలో మరణమొందినప్పుడు, మనకు దేవునికి మధ్య గల ఆ అడ్డుబండను తొలగించెను. తత్ఫలితంగా, మన సృష్టికర్తతో మనకు ఒక సంబంధమును ఏర్పరచెను. మనమిప్పుడు ఆయన కుమారులుగాను మరియు కుమార్తెలగాను మార్చబడ్డాము. ఆత్మ మనకు ఆ సంబంధమును గూర్చిన నిశ్చయతనిచ్చును మరియు దేవుని ఇంకనూ తెలుసుకొనుటకు ఆయన మనకు సహాయము చేయును. మనము ప్రార్థించుటకు మరియు దేవుని వాక్యము(బైబిల్)ను గ్రహించుటకు ఆయన సహాయము చేయును.

ప్రేమించుటకు స్వాతంత్రము

'ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము' (1 యోహాను 4:19). మనము ఆ సిలువ వైపు చూసినప్పుడు, మన పట్ల దేవుని ప్రేమను అర్థము చేసికొనగలము. దేవుని ఆత్మ మనలో నివసించుటకు వచ్చినప్పుడు, ఆ ప్రేమను మనము అనుభవించగలము. మనము అలా చేస్తున్నపుడు, దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల ఒక నూతనమైన ప్రేమను మనము పొందుకుంటాము. మన చుట్టూనే కేంద్రీకృతమయ్యే జీవితము కాక యేసును మరియు ఇతరులను ప్రేమిస్తూ, సేవ చేసే క్రియలయందు కేంద్రీకృతమై యున్న - ప్రేమామయమైన జీవితమును మనము జీవించుటకు స్వాతంత్రము పొందితిమి.

మార్పునొందుటకు స్వాతంత్రము

'నీవు ఏమైయున్నావో ఉన్నావో నీవు అదే విధముగా ఉంటావు తప్ప నీవు మార్పుచెందలేవు.' అని లోకము కొన్నిసార్లు చెప్పును. శుభవార్త ఏమనగా, ఆత్మ యొక్క సహాయము ద్వారా మనము మార్పు నొందగలము. మన హృదయపు లోతుల్లో ఎప్పటినుంచో జీవించాలనుకున్న జీవితమును జీవించగల స్వాతంత్రమును, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించెను. 'ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము' (గలతీ 5:22-23) అని పౌలు ఆత్మ ఫలమును గురించి మనకు తెలియజేసెను. మనలోనికి వచ్చి వసియించుమని దేవుని ఆత్మను మనము కోరినప్పుడు, ఇట్టి అద్భుతమైన కార్యములు మన జీవితములలో అభివృద్ధి పొందుటకు ప్రారంభమగును.

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

Why Easter?

ఈస్టర్ ప్రాముఖ్యత ఏమిటి? 2,000 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తిపై ఎందుకు అంత ఆసక్తి నెలకొనింది? అనేకులు యేసును గురించి ఉత్తేజితులవుటకు కారణమేమిటి? ఆయన మనకెందుకు అవసరము? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఇవన్నీ తెలుసుకొనుటకు ఆరాటపడవలసిన అవసరమేమిటి? ఈ 5 రోజుల ప్రణాళికలో, నిక్కీ గుంబెల్ ఆ ప్రశ్నలకు ఆలోచింపచేసే సమాధానాలను పంచుకుంటాడు.

More

ఈ ప్రణాళికను అందించినందుకు ఆల్ఫా మరియు నిక్కీ గుంబెల్ లకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://alpha.org/