ఈస్టర్ ఎందుకు?నమూనా

ఆయన ఎందుకు ఈ లోకమనకు వచ్చెను, మరియు ఆయన ఎందుకు చనిపోయెను?
తన యొక్క పుట్టుక ఎలా ఉండాలో ఎన్నుకున్న ఏకైక వ్యక్తి యేసు మాత్రమే, మరియు మరణమును ఎంచుకున్న కొద్దిమందిలో ఆయన ఒకడుగా ఉండెను. తాను వచ్చుటకు గల కారణం కేవలము మన కొరకు మరణించడమేనని ఆయన చెప్పెను. ‘అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు’ఆయన వచ్చెను(మార్కు 10:45).
తాను మన ‘కొరకు’ చనిపోయెనని యేసు చెప్పెను. ‘కొరకు’ అనే పదానికి ‘బదులుగా’ అని అర్ధం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మరియు మనం చేసిన తప్పులన్నిటికీ మనం శిక్షింపబడాలని ఆయన అనుకొనుట లేదు. సిలువపై, ‘నేను ఆ విషయాలన్నీ నా మీదకు వేసుకుంటాను’ అని ఆయన నిశ్చయంగా చెబుతున్నాడు. ఆయన మీ కోసం చేసాడు, నా కోసం చేసాడు. ఒకవేళ నీవు లేదా నేను ప్రపంచంలో ఉన్న ఏకైక వ్యక్తి అయినా కూడా, ఆయన మన కోసం చేసేవాడు. సెయింట్ పౌలు ‘నన్ను ప్రేమించి, నాకోసం తనను తాను ఇచ్చిన దేవుని కుమారుడు’ గురించి వ్రాశాడు (గలతీయులు 2:20). ఆయన తన జీవితాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చాడు.
‘విమోచన’ అనే పదం బానిసల అంగడుల నుండి వచ్చింది. దయగల వ్యక్తి ఒక బానిసను కొని అతన్ని విడిపించవచ్చు-కాని మొదట విమోచన ధర చెల్లించాలి. యేసు సిలువపై తన రక్తం ద్వారా, విమోచన క్రయధనమును చెల్లించి మనలను విడిపించుకున్నాడు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

ఈస్టర్ ప్రాముఖ్యత ఏమిటి? 2,000 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తిపై ఎందుకు అంత ఆసక్తి నెలకొనింది? అనేకులు యేసును గురించి ఉత్తేజితులవుటకు కారణమేమిటి? ఆయన మనకెందుకు అవసరము? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఇవన్నీ తెలుసుకొనుటకు ఆరాటపడవలసిన అవసరమేమిటి? ఈ 5 రోజుల ప్రణాళికలో, నిక్కీ గుంబెల్ ఆ ప్రశ్నలకు ఆలోచింపచేసే సమాధానాలను పంచుకుంటాడు.
More