యోబు 36

36
1మరియు ఎలీహు ఇంక యిట్లనెను
2–కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు
తెలియజేసెదను.
ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడ
వలసియున్నది.
3దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును
నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను.
4నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు
పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు.
5ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన
ఎవనిని తిరస్కారము చేయడు
ఆయన వివేచనాశక్తి బహుబలమైనది.
6భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు
ఆయన దీనులకు న్యాయము జరిగించును.
7నీతిమంతులను ఆయన చూడకపోడు
సింహాసనముమీద కూర్చుండు రాజులతో
ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టునువారు ఘనపరచబడుదురు.
8వారు సంకెళ్లతో కట్టబడినయెడలను
బాధాపాశములచేత పట్టబడినయెడలను
9అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని
ఆయన వారి వారికార్యములను వారి వారి దోషము
లను వారికి తెలియజేయును.
10ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును.
పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును.
11వారు ఆలకించి ఆయనను సేవించినయెడల
తమ దినములను క్షేమముగాను
తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
12వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి
నశించెదరు.
జ్ఞానములేక చనిపోయెదరు.
13అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేనివారు క్రోధము నుంచుకొందురు.
ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.
14కావునవారు యౌవనమందే మృతినొందుదురువారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.
15శ్రమపడువారిని వారికి కలిగినశ్రమవలన#36:15 శ్రమలో. ఆయన
విడిపించును.
బాధవలన వారిని విధేయులుగా చేయును.
16అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పించును.
ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొనిపోవును
నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.
17దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది
న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.
18నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ
తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము
నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు
19మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.
నీవు మొఱ్ఱపెట్టుటయు
బల ప్రయత్నములు చేయుటయు
బాధనొందకుండ నిన్ను తప్పించునా?
20జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి
రావలెనని కోరుకొనకుము.
21జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము.
దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరు
కొనియున్నావు.
22ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత
వహించినవాడు
ఆయనను పోలిన బోధకుడెవడు?
23ఆయనకు మార్గము నియమించినవాడెవడు?
–నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో
ఎవడు పలుక తెగించును?
24మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును
మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.
25మనుష్యులందరు దాని చూచెదరు
నరులు దూరమున నిలిచి దాని చూచెదరు.
26ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము
ఆయనను ఎరుగము
ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.
27ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును
మంచుతోకూడిన వర్షమువలె అవి పడును
28మేఘములు వాటిని కుమ్మరించును
మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును.
29మేఘములు వ్యాపించు విధమును
ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును
ఎవడైనను గ్రహింపజాలునా?
30ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును
సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.
31వీటివలన ఆయన ఆయా ప్రజలకు తీర్పుతీర్చును.
ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు
32ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును
గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును
33ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును
తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 36: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in