యోబు 35

35
1మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
2–నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభముకన్న
నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది
నీకు ప్రయోజనమేమి? అని
నీవు చెప్పుచున్నావే?
3ఇదే న్యాయమని నీకు తోచినదా?–
దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను
చున్నావా?
4నీతోను నీతోకూడనున్న నీ సహవాసులతోను నేను
వాదమాడెదను.
5ఆకాశమువైపు నిదానించి చూడుము
నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు
చూడుము.
6నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా?
నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన
చేసితివా?
7నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చు
చున్నావా?
ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?
8నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును
నరులకే నీ నీతి ఫలము చెందును.
9అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలువేయుదురు
బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై
కేకలు వేయుదురు.
10అయితే–రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే
పించుచు
11భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు
ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ
జేయుచు
నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను
కొనువారెవరును లేరు.
12కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి
మొఱ్ఱపెట్టుదురు గాని
ఆయన ప్రత్యుత్తర మిచ్చుటలేదు.
13నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని
బెట్టడు
సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.
14–ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము
ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము
నీవు కనిపెట్టవలెను.
15ఆయన కోపముతో దండింపక పోయినందునను
నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక
పోయినందునను
16నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు
తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 35: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in