YouVersion Logo
Search Icon

BibleProject | ఆగమన ధ్యానములుSample

BibleProject | ఆగమన ధ్యానములు

DAY 18 OF 28

ఇజ్రాయెల్ దేవుడు కాకుండా తమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఫలితంగా, వారు తమ భూమి నుండి చెరగొనబడ్డరు మరియు అన్యరాజ్యాలచే పాలించబడ్డారు. అయితే దుఃఖము మరియు విచారము నిరంతరము ఉండదని ప్రవక్తయినా యెషయాకు తెలుసు. ఇజ్రాయెల్ యొక్క దయగల దేవుడు వారిని అణచివేత నుండి విడిపించడానికి మరియు వారిని శాశ్వతమైన ఆనందానికి నడిపించడానికి ఒక విమోచకుడిని లేపుతాడని అతను ఎదురు చూశాడు. 


చదవండి:


యెషయా 51:11, యెషయా 49:13


పరిశీలించు:


మీ జీవితంలో ఇప్పుడు భారంగా అనిపించే విష్యాలను గుర్తించండి.


మీ స్వంత నష్టాలు లేదా బాధల గురించి మీ స్వంత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నేటి భాగాలను నెమ్మదిగా సమీక్షించండి. మీరు మళ్లీ చదివినప్పుడు ఏ ఆలోచనలు లేదా భావాలు వస్తాయి?


అయన శాశ్వతమైన ఆనందాన్ని పునరుద్ధరించిన దృక్పథంతో దేవుడు మిమ్మల్ని ఓదార్చాలని ప్రార్థించండి.


Day 17Day 19

About this Plan

BibleProject | ఆగమన ధ్యానములు

యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.

More