BibleProject | ఆగమన ధ్యానములుSample
"బైబిల్ యొక్క ఒక పేజీలో, దేవుడు ఈ ప్రపంచం మంచిదని చెప్పాడు, కాబట్టి సహజంగా దేవుడు చేసిన మంచి పనులలో ప్రజలు ఆనందం పొందుతారు. కానీ బైబిల్ వృతాంతం ఈ ప్రపంచం మన స్వార్థంతో ఎలా పాడైపోయిందో. ఇప్పుడు ఈ ప్రపంచం మరణం మరియు నష్టంతో గుర్తించబడడం చూస్తున్నాం. చాలా గందరగోళం మరియు బాధల మధ్య ఎవరైనా ఆనందాన్ని ఎలా అనుభవించగలరు? ఈ ఉద్రిక్తత మధ్య, బైబిల్ ఆనందంపై ప్రత్యేకమైన దృక్పథాన్ని అందిస్తుంది. దేవుని ప్రజల ఆనందం వారి ప్రస్తుత గమ్యంపై కాకుండా వారి భవిష్యత్తు గమ్యంపై దేవుని వాగ్దానాల ద్వారా నిలకడగా ఉంది. ఉదాహరణకు, దేవుడు ఇజ్రాయెల్ని బానిసత్వం నుండి రక్షించినప్పుడు, దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేసిన భూమికి దూరంగా, అరణ్యం మధ్యలో ఉన్నప్పటికీ వారు సంతోషంతో కేకలు వేశారు.
చదవండి:
కీర్తన 105: 42-43, నిర్గమకాండము 15: 1-3
పరిశీలించు:
ఈ రోజు సంతోషించడానికి దేవుని ఏ వాగ్దానాలు మీకు సహాయపడతాయి?
ప్రతిస్పందనగా, మీ కొరకు ఉన్న దేవుని వాగ్దానాలను వేడుకగా జరుపుకొనుటకు ప్రార్థన రాయండి లేదా పాడండి.
Scripture
About this Plan
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More