YouVersion Logo
Search Icon

BibleProject | ఆగమన ధ్యానములుSample

BibleProject | ఆగమన ధ్యానములు

DAY 14 OF 28

అపొస్తలుడైన పౌలు చెరసాల నుండి ఫిలిప్పీయులకు తన పత్రిక రాశాడు. అతనికి కష్టాలు తెలుసు, కానీ దేవుని శాంతి కూడా అతనికి తెలుసు. ఎందుకంటే, బైబిల్ శాంతి, నిరీక్షణ లాంటిది, అది పరిస్థితులపై కాక, ఒక వ్యక్తిపై ఆధారపడి ఉంతుంది.  పౌలు తన అనుచరులు అన్ని     సమయములనందు దేవునిలో సంతోషించాలని, ప్రార్థన చేయాలని, కృతజ్ఞతలు తెలియజేయాలని మరియు ఏది మంచిదో ఏది సత్యమో ఆలోచించాలని పిలుపునిచ్చాడు. ఈ అలవాట్లు చాలా కష్టాల మధ్య కూడా దేవుని శాంతిని అనుభవించుటకు ఎలా దారి తీస్తాయో పౌలు చూపాడు.   


చదవండి:


ఫిలిప్పీయులు 4: 1-9


పరిశీలించు:


ఫిలిప్పీయులు 4: 1-9లో పౌలు ఇచ్చే అన్ని సూచనల జాబితాను రూపొందించండి (అనగా ""ప్రభువునందు స్థిరులై యుండుడి,"" "" ఏకమనస్సుగలవారై  జీవించండి,"" మొదలైనవి). 


మీ జాబితాను గమనించండి. మరియు ప్రతి ఒకటిని అలవాటుగా మార్చుకోండి. మీ రోజువారీ జీవితంలో ఆచరణాత్మకంగా ఆ అలవాట్లు ఎలా ఉంటాయి? ఆ అలవాట్లు చివరికి దేవుని సమాధానమును అనుభవించుటకు ఎలా నడిపిస్తాయని మీరు అనుకుంటున్నారు?


7 మరియు 9 వ వచనాలను సమీక్షించండి. మీరు ఏమి గమనిస్తున్నారు? దేవుని సమాధానము యొక్క రక్షణ స్వభావం గురించి ఈ వచనాలు మనకు ఏమి చెబుతున్నాయి? అయన రక్షణకు ఇప్పుడు మీ కృతజ్ఞతలు తెలియజేయండి.  


Day 13Day 15

About this Plan

BibleProject | ఆగమన ధ్యానములు

యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రే...

More

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy