BibleProject | ఆగమన ధ్యానములుSample
అపొస్తలుడైన పౌలు యేసు స్వయంగా మన సమాధానము అని చెప్పాడు. యేసు మానవాళిని ఒకరి నుండి ఇంకోకరిని మరియు దేవుని నుండి వేరుచేసే అన్ని విషయాలను తీసివేసాడు మరియు ఇప్పుడు అయన సమాధానమును ఇతరులకు బహుమతిగా అందిస్తాడు. యేసు అనుచరులు ఈ సమాధాన బహుమతిని పొందుటకును, కలిగియుండుటకును మరియు పెంపొందించుటకును పిలువబడ్డారు, దీనికి వినయం, సౌమ్యత, సహనం మరియు ప్రేమ అవసరమై యున్నది.
చదవండి:
ఎఫెసీయులు 2: 11-15, ఎఫెసీయులు 4: 1-3, ఎఫెసీయులు 4: 29-32
పరిశీలించు:
ఈ వాక్యభాగము ప్రకారం, యేసు తీవ్రంగా విభజించబడిన రెండు సమూహాలను (యూదులు మరియు అన్యజనులు) ఎలా సమాధానపరిచాడు, మరియు అయన దానిని ఎందుకు చేశాడు (2:16 వచనము చూడండి)?
మీరు మీ జీవితంలో ఎవరికైనా దూరంగా ఉన్నట్లు భావిస్తున్నారా? మీరు ఈ వ్యక్తితో మళ్లీ శాంతిని ఆస్వాదించాలనుకుంటున్నారా? ఎందుకు లేదా ఎందుకు కాదు? సమాధానపరచడానికి యేసు ఏమి చేశాడో పరిశీలించండి. మీరు దీని గురించి ప్రతిబింబిస్తున్నప్పుడు ఏ ప్రశ్నలు మరియు భావోద్వేగాలు తలెత్తుతున్నాయి?
ఎఫెసీయులు 4: 1-3 ని జాగ్రత్తగా సమీక్షించండి. యేసు తన అనుచరుల కోసం చేసిన ఐక్యతను కాపాడుకోవడానికి వినయం, సౌమ్యత, సహనం మరియు ప్రేమ ఎలా సహాయపడతాయని మీరు అనుకుంటున్నారు? ఈ ధర్మాలలో ఒకటి తప్పిపోయినప్పుడు ఏమి జరుగుతుంది? మీరు ఇతరుల కోసం తీర్మణములు చేయలేరు, కానీ శాంతిని పెంపొందించడానికి మీరు ఈ రోజు చేయగల ఒక ఆచరణాత్మక నిర్ణయం ఏమిటి?
ఎఫెసీయులు 4: 29-32 ని దగ్గరగా సమీక్షించండి. యేసు మిమ్మల్ని ఎలా క్షమించాడు? మీ క్షమాపణ ఎవరికి కావాలి?
About this Plan
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More