BibleProject | ఆగమన ధ్యానములుSample
ప్రవక్తయినా యెషయా సమాధానకర్తయగు అధిపతి రాక కోసం ఎదురుచూశాడు, అయన పాలన శాశ్వతమైన షాలోమ్కు దారితీస్తుంది. యెషయా మాటలు యేసు రాకతో నెరవేరాయి. అందుకనే దేవదూతలు యేసు పుట్టుకను ""భూమిమీద సమాధానము"" గా వర్ణించడం చాలా ప్రాముఖ్యమైనది.
చదవండి:
లూకా 2: 9-15
పరిశీలించు:
పేరు లేని గొర్రెల కాపరులకు రాజు రాకను దేవుడు ప్రకటించాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దేవుని స్వభావం మరియు అయన రాజ్యం గురించి ఇది మీకు ఏమి తెలియజేస్తుంది?
మీరు ఆ రాత్రి గొర్రెల కాపరులుతో అక్కడ ఉన్నారని ఊహించండి. మీ అనుభూతి ఎలాఉంటాధి? మీరు ఎలా స్పందిస్తారు?
దేవదూతల ఆరాధన ప్రకటనలో “సర్వోన్నతమైన స్థలములలో "" మరియు ""భూమి"" అనే పదాలను గమనించండి. యేసు జన్మించినప్పుడు పరలోకం నుండి భూమి మీదికి ఏమి వచ్చింది? ఆ శుభవార్త ఎలా ఉంది? మీరు పరిశీలుస్తు ఉండగా, మీ విస్మయం మరియు కృతజ్ఞతా భావాలను వ్యక్తం చేయడానికి ప్రార్థన చెయ్యండి.
Scripture
About this Plan
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More