ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనంSample
విరుద్ధమైన రాజ్యం
నేటి ప్రపంచంల బలం, అధికారం, సంపద, శక్తియుక్తులను బట్టి సంతోషపడతారు. దానిని గురించి అధికంగా మాట్లాడుతారు. లోకం ఆశీర్వదించబడినదిగా చెప్పినదానిని పభువైన యేసు తలకిందులు చేసాడు. ఒక నూతన ప్రమాణాన్ని ఏర్పరచాడు. ప్రభువైన యేసు చెప్పిన ప్రకారం, నిజంగా ఆశీర్వదించబడినవారు ఆధ్యాత్మికంగా పేదలు, సౌమ్యులు, దుఃఖించేవారు, దేవుని కోసం ఆకలితో ఉన్నవారు, స్వచ్ఛమైనవారు, సమాధానకర్తలు, హింసించబడినవారు. ఆ కారణంగా ఈ రాజ్యం విరుద్ధమైన స్వభావాన్ని కలిగియుంది. దీనులు, విరిగిన వారు, వినయంతోకూడినవారు, దేవుణ్ణి వెదకేవారు ఈ రాజ్యంలో ఒక స్థానాన్ని కనుగొంటారు, అక్కడ కార్య సిద్ధి, ప్రభావం లేదా వీటన్నిటినీ కలిగియుండడం ఎక్కువగా లెక్కించబడవు.
“ధన్యతలు” పదానికి “ఉన్నతంగా ఆశీర్వడించబడినది”అని అర్థం. ప్రభువైన యేసును మన రక్షకుడిగా తెలుసుకోవడం ఆయన రాజ్యంలోకి మనకు ప్రవేశం కల్పిస్తుందనీ, అందువల్ల నమ్మశక్యం కాని ఆశీర్వాద జీవితాన్ని జీవించడానికి మనలను నడిపిస్తుందని సూచిస్తుంది.
అయితే కానీ .. ఈ ఆశీర్వాద జీవితం భయశీలులకు కాదు.
ప్రతి మానవుని జీవితం ఎత్తు, పల్లాలనూ, ఉన్నత స్థితీ లోతైన స్థితీ, మెలికలు, మలుపులూ, కలిగియుంది. జీవితం అనూహ్యమైనది, గజిబిజిగానూ, కఠినమైనదిగానూ ఉంది. దేవుని రాజ్యంలో, వారు ఎవరికీ చెందియున్నారో తెలుసుకున్నవారూ, నిత్యజీవం అను వారి బహుమానం కోసం ముందుకు కదిలేవారూ ధన్యులు. దేవుని వెంబడించడంలోనూ, తోటి వారి పట్ల జాలిని చూపించడంలోనూ ఏదీ వారిని ఆపలేదు లేదా ఎవరూ వారిని ఆపలేరు. ఈ రాజ్యం గురించీ, దాని అంశాల గురించీ మరింతగా తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
Scripture
About this Plan
క్రైస్తవ ప్రయాణం దాని పర్వత శిఖర దృశ్యాలు, లోతైన లోయ ఋతువుల విభిన్న అనుభవాలతో నిండి ఉంది. జీవితంలో మనం ఉన్న జీవిత కాలంతో సంబంధం లేకుండా, మన చుట్టూ ఉన్నవారిపై మనం ఒక గుర్తును చూపాలి, తద్వారా వారు యేసును కలిగియుంటారు, లేదా మనలో భిన్నమైన వాటి గురించిన కనీస ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఉండే ప్రతీ కాలంలో దేవుని కమ్మదనాన్నీ, రుచినీ, అప్రయత్నంగా తీసుకురావాలని మీకోసం మా ప్రార్థన.
More