YouVersion Logo
Search Icon

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనంSample

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం

DAY 5 OF 10

ఆకలిదప్పులు గలవారు ధన్యులు 

నీతి కోసం ఆకలి, దప్పులు గలవారు మంచి జీవితాన్ని జీవించాలని ఆరాటపడతారు. ప్రభువైన యేసు ఆ జీవితం కేంద్రంలో ఉంటేనే అది మంచి జీవితంగా ఉంటుంది, అది మన చుట్టూ ఉన్న ప్రజలను సానుకూలంగా ప్రభావితం చెయ్యగలిగితేనే మంచి జీవితంగా ఉంటుంది. దేవుని విషయాల కోసం ఆకలితో ఉండడం అంటే మన హృదయంతో దేవుణ్ణి వెతకడం, మన వద్ద ఉన్న ప్రతిదానితోనూ, మన పూర్తి జీవితాలతోనూ ఆయనను గౌరవించటానికి యెంచుకోవడం. చెయ్యడం కంటే చెప్పడం సులభం, ఎందుకంటే మన దినాలు పని, కుటుంబం, పరిచర్య ఆలోచనలతో నిండినందున ఇది చాలా సులభం. ఇవన్నీ ఖచ్చితంగా కీలకమైనవి అయితే, ఇతరులనుండి ఆశీర్వదించబడినవారిని వేరుచేసే విషయం వారి దేవుణ్ణి గౌరవించటానికి సమయం తీసుకోవడం. వారు రోజులో ఏదో ఒక సమయంలో ఆయనతో ఒంటరిగా సమయాన్ని గడుపుతారు. అయితే వారు తమ రోజంతా నిరంతరం దేవునితో సంభాషించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకొన్నారు. 

జాన్ పైపర్ తన పుస్తకం ‘ఎ హంగర్ ఫర్ గాడ్” లో ఇలా అన్నాడు, “దేవుని మహిమ ప్రత్యక్షత కోసం మీకు బలమైన కోరికలు కలగకపోతే, అది మీరు బాగా తాగి సంతృప్తి చెందడం వల్ల కాదు, మీరు లోకపు బల్ల వద్ద దీర్ఘకాల కొంచెం కొంచెంగా తీసుకొన్నారు. మీ ఆత్మ చిన్న విషయాలతో నిండి ఉంది, గొప్పవాటికీ చోటు లేదు. ”

ఫోనులు, హాట్ స్టార్లు/నెట్‌ఫ్లిక్స్ షోలు, నిరాటంక కార్యక్రమాల నుండి దూరంగా ఉంది సమయం కేటాయించడం సాధ్యమేనా?

జాన్ పైపర్ ఇలా చెబుతున్నాడు “నేను ఇప్పటివరకు కలుసుకున్న బలమైన, అత్యంత పరిణతి చెందిన క్రైస్తవులు దేవుని విషయంలో ఆకలితో ఉన్నవారే. ఎక్కువగా తినేవారు తక్కువ ఆకలితో ఉంటారని అనిపించవచ్చు. అయితే తరగని జలధారతోనూ, అనంతమైన విందూ, మహిమాన్వితుడైన ప్రభువుతోనూ ఈ విధానంలో జరుగదు.

ఇది ఇంతకు మునుపెన్నడూ లేనంతగా దేవుని కోసం ఆకలితో ఉండటానికి మనల్ని కదిలించాలి. ఆయననూ, ఆయన వాక్యాన్నీ మనం ఎంత ఎక్కువగా కలిగియుంటామో అంత ఎక్కువ అవసరతను కలిగియుంటాము. మన తీరు ఆయన కోసం ఆకలిదప్పులు కలిగినదిగా ఉన్నప్పుడు మనం నింపబడతాము, పొంగిపొరలేలా నింపబడతాము అని ప్రభువైన యేసు చెప్పాడు. మీరు దానిని గ్రహించకపోవచ్చు కానీ మీ చుట్టూ ఉన్న ఇతరులు ఆ వ్యత్యాసాన్ని గ్రహిస్తారు. ప్రభువైన యేసు వాగ్దానం చేసిన జీవ జలాలను లోతుగా తాగాలి, దేవుని వాక్యం చేత పోషించబడాలి, ఇది మాత్రమే మనలను తృప్తి పరుస్తుంది.

Day 4Day 6

About this Plan

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం

క్రైస్తవ ప్రయాణం దాని పర్వత శిఖర దృశ్యాలు, లోతైన లోయ ఋతువుల విభిన్న అనుభవాలతో నిండి ఉంది. జీవితంలో మనం ఉన్న జీవిత కాలంతో సంబంధం లేకుండా, మన చుట్టూ ఉన్నవారిపై మనం ఒక గుర్తును చూపాలి, తద్వారా వారు యేసును కలిగియుంటారు, లేదా మనలో భిన్నమైన వాటి గురించిన కనీస ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఉండే ప్రతీ కాలంలో దేవుని కమ్మదనాన్నీ, రుచినీ, అప్రయత్నంగా తీసుకురావాలని మీకోసం మా ప్రార్థన.

More