YouVersion Logo
Search Icon

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనంSample

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం

DAY 9 OF 10

హింసించబడు వారు ధన్యులు 

2019 వరల్డ్ వాచ్ జాబితా ప్రపంచవ్యాప్తంగా తమ విశ్వాసం కోసం హింసించబడుతున్న క్రైస్తవుల సంఖ్యపై సమగ్ర నివేదిక ఇచ్చింది. 2016-2017 సంవత్సరానికి మాత్రమే 245 మిలియన్ల క్రైస్తవులు అధిక స్థాయిలో హింసను అనుభవించారని వారు నివేదించారు. వరల్డ్ వాచ్ జాబితా దేశాలలో క్రైస్తవులు తమకున్న విశ్వాసాన్ని ప్రతి నెలా 105 సంఘాలపై దాడులు జరుగుతున్నాయి, ప్రతిరోజూ 11 మంది క్రైస్తవులు చంపబడుతున్నాయి. ఈ సంఖ్యలు పూర్తి కథను చెప్పవు ఎందుకంటే అవి నిజమైన పురుషులు, మహిళలు, పిల్లలను సూచిస్తున్నాయి. ప్రభువైన క్రీస్తును అనుసరించడం వీరికి విలువైనదీ, ప్రమాదకరమైనది. తీవ్రమైన ప్రాణాంతక హింసను మనం అనుభవించకపోవచ్చు, కాని మనం క్రీస్తును అనుసరిస్తున్నామంటే ఇబ్బందిని ఆహ్వానిస్తున్నట్టే. మనం సాత్వికులం, సమాధానాన్ని ప్రేమించేవారం, దేవుని కోసం ఆకలిగొన్నవారం, హృదయ శుద్ధికలవారం, కనికరం కలవారం అనే వాస్తవం మనం పని చేసే స్థలం, పాఠశాల, మన పరిసరాలలో కుటిలంగానూ, అధిక కుటిలము గాని హింసకు ప్రధాన లక్ష్యంగా మారడానికి కారణమవుతుంది. అటువంటి వ్యతిరేకతను ఎదురుచూడమనీ, దానిలో సంతోషించమనీ ప్రభువైన యేసు మనలను అడుగుతున్నాడు, ఎందుకంటే పూర్వపు ప్రవక్తలను ఈ విధంగానే చేశారు. ఆసక్తికరంగా, ఆయన తక్షణ భూసంబంధమైన ప్రతిఫలాలను ప్రస్తావించలేదు, దానికి బదులుగా ఆయన శాశ్వతమైన ప్రతిఫలాల గురించి మనకు అభయాన్ని ఇస్తున్నాడు. 

మీరు క్రీస్తు శిష్యునిగా ఈ ప్రయాణంలో నడుస్తున్నప్పుడు, మీరు హింసను భరించడానికీ, దాని విషయంలో  ఆనందంగా ఉండడానికీ సిద్ధంగా ఉన్నారా? 

Day 8Day 10

About this Plan

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం

క్రైస్తవ ప్రయాణం దాని పర్వత శిఖర దృశ్యాలు, లోతైన లోయ ఋతువుల విభిన్న అనుభవాలతో నిండి ఉంది. జీవితంలో మనం ఉన్న జీవిత కాలంతో సంబంధం లేకుండా, మన చుట్టూ ఉన్నవారిపై మనం ఒక గుర్తును చూపాలి, తద్వారా వారు యేసును కలిగియుంటారు, లేదా మనలో భిన్నమైన వాటి గురించిన కనీస ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఉండే ప్రతీ కాలంలో దేవుని కమ్మదనాన్నీ, రుచినీ, అప్రయత్నంగా తీసుకురావాలని మీకోసం మా ప్రార్థన.

More